అనుపమ ఇక ముద్దులు పెట్టకపోవచ్చు!

Anupama Parameswaran


అనుపమ పరమేశ్వరన్ ఇటీవల చాలా బోల్డ్ గా నటించింది. ఆమె అలా కనిపించడం ఆశ్చర్యపరిచింది. “రౌడీబాయ్స్” సినిమాలో అనుపమ కిస్ సీన్లలో నటించడం హాట్ టాపిక్. అవి మామూలు కిస్ సీన్లు కాదు. డీప్ లిప్ లాకులు. ఏకంగా మూడు సీన్లలో నటించింది. అలాగే ఒక బెడ్ రూమ్ దృశ్యం కూడా ఉంది.

అనుపమ మునుపెన్నడూ ఇంత హాట్ గా నటించలేదు. ఈ సినిమా కథ ప్రకారం అలా చేసిందా లేక నిర్మాత దిల్ రాజు భారీగా డబ్బు ఇవ్వడమే వల్లే చేసిందా తెలియదు. ఐతే, ఆమె ఇక హాట్ సీన్లకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లే అని ఫిలింమేకర్స్ భావిస్తున్నారు. ఇకపై ఆమెకి అలాంటి సీన్లు రాస్తారు అని చెప్పడంలో డౌట్ అక్కర్లేదు.

కానీ, అనుపమ మాత్రం ఇకపై అన్ని సినిమాల్లో ముద్దు సీన్లకు రెడీ కాదు అని చెప్తోంది. “రౌడీ బాయ్స్” వేరు.

ప్రస్తుతం ఆమె చేతిలో “18 పేజెస్”, “కార్తికేయ 2” సినిమాలున్నాయి. రెండింటిలోనూ హీరో నిఖిల్ సిద్ధార్థ్. నిఖిల్ హాట్ సీన్లకు దూరంగా ఉండే బాపతు. సో… ఈ రెండు సినిమాల్లో లిప్ టు లిప్ లాకులు ఉండకపోవచ్చు.

 

More

Related Stories