మహేష్ ట్రీట్మెంట్ చేయించుకున్నారా?

Mahesh Babu


ఈ మధ్య హీరోలు, హీరోయిన్లు తమ ముఖాలకు ట్రీట్మెంట్ లు చేయించుకుంటున్నారు. కొందరు స్కిన్ సమస్యల వల్ల. మరికొందరు వయసు మీద పడడం వల్ల. దాంతో, ఏ హీరోయిన్, హీరో ముఖాకృతి మారినా వాళ్ళు ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్నారనో, కాస్మెటిక్ ట్రీట్మెంట్ చేయించుకున్నారనో ప్రచారం మొదలవుతోంది.

ఇలాంటి ఊహాగానాలు, ప్రచారాలు మహేష్ బాబు విషయంలో తాజాగా మొదలయ్యాయి. ఎందుకంటే, లేటెస్ట్ గా మహేష్ బాబు తన కొత్త ఫోన్ నుంచి కొత్త ఫోటో ఒకటి షేర్ చేశారు. ఈ ఫొటోలో మహేష్ బాబు ముఖం మరీ లేతగా కనిపించింది. అలాగే, చాలా యంగ్ గా ఉన్నారు.

దాంతో, మహేష్ బాబు కూడా కొత్త సినిమా కోసం తన ముఖానికి ట్రీట్మెంట్ చేయించుకున్నారు అనే ప్రచారం మొదలైంది.

కానీ, ఈ హ్యాండ్సమ్ సూపర్ స్టార్ అలాంటి కాస్మెటిక్ మెరుగులు ఏమి దిద్దుకోలేదు. అది ఐఫోన్ 14 మాక్స్ ఫ్రొ ఫోన్ మహిమ. మహేష్ బాబు కొంతకాలంగా ఫిట్నెస్ ని కాపాడుకుంటూ వస్తున్నారు. ఆయన బాగా సన్నపడడంతో వయసు తగ్గినట్లు కనిపిస్తున్నారు. దానికి తోడు కొత్త ఫోన్ లో క్లారిటీ ఫోటో.

Advertisement
 

More

Related Stories