​సినిమాలు తగ్గాయా? తగ్గించిందా?

- Advertisement -
Nayanthara

నయనతార తమిళ సినిమా ఇండస్ట్రీలో నెంబర్ వన్ హీరోయిన్. ఒక విధంగా చెప్పాలంటే సౌత్ ఇండియా మొత్తంగా చూసినా ఆమెదే అగ్రస్థానం. ఎందుకంటే ఆమె తీసుకునేంత పారితోషికం మరో సౌత్ ఇండియన్ భామ తీసుకోవడం లేదు.

సినిమాకి ఆరు నుంచి ఎనిమిది కోట్లు తీసుకునే నయనతార గతేడాది బాలీవుడ్ లోకి కూడా సక్సెసఫుల్ గా అడుగుపెట్టింది. మొదటి చిత్రమే బ్లాక్ బస్టర్. షారుక్ సరసన ఆమె “జవాన్” సినిమాలో నటించింది. ఈ సినిమా 1000 కోట్లపైన వసూళ్లు అందుకొంది. ఐతే తమిళంలో కానీ, తెలుగులో కానీ ఆమెకి ఇప్పుడు సినిమాలు లేవు.

మరీ ముఖ్యంగా తమిళ చిత్ర రంగంలో ఆమెకి పెద్దగా సినిమాలు లేకపోవడం ఆశ్చర్యమే.

నయనతార చేతిలో ఇప్పుడు ఒకే ఒక్క తమిళ మూవీ ఉంది. అది కూడా విడుదలకు సిద్ధంగా ఉంది. దీని షూటింగ్ మొత్తం పూర్తి అయింది. కొత్తగా ఈ భామ సినిమాలు అనౌన్స్ చెయ్యలేదు. రెండేళ్ల క్రితం వరకు కూడా నయనతార హీరోయిన్ గా అనేక సినిమాలను తమిళ నిర్మాతలు ప్రకటించేవాళ్ళు. ఐతే ఇప్పుడు ఆ దూకుడు తగ్గింది. ఆమె పారితోషికం భారీగా ఉండడం. ఆమెతో తీసిన లేడీ ఓరియెంటెడ్ చిత్రాలకు మునుపటిలా లాభాలు రాకపోవడంతో తమిళ నిర్మాతలు అంతగా ఉత్సాహం చూపడం లేదు. దాంతో ఆమెకి సినిమా ఆఫర్లు బాగా తగ్గాయి.

ఇక పెద్ద హీరోలు కూడా ఆమెతో నటించేందుకు ఆసక్తి చూపడం లేదు.

Nayanthara

ఇక ఆమె రియల్ లైఫ్ లో తల్లి పాత్రతో బిజీగా ఉంది. ఆమెకి ఇటీవల ఇద్దరు కవలలు కలిగారు.

 

More

Related Stories