
ఇటీవల రామ్ చరణ్ తరుచుగా ముంబై వెళ్తున్నారు. ఇక్కడ షూటింగ్ లేకపోతే అక్కడే ఉంటున్నారు. రామ్ చరణ్, ఆయన భార్య ఉపాసనకు ముంబైలో ఎక్కువ మంది స్నేహితులు ఉన్నారు. ఐతే, రామ్ చరణ్, ఉపాసన అక్కడ ఒక కొత్త ఇల్లు కొనుక్కున్నారు అనే ప్రచారం మొదలైంది.
రామ్ చరణ్, ఉపాసన ఇంతకుముందు ఒక అపార్ట్మెంట్ లో ఉండేవాళ్ళు ముంబై. ప్రస్తుతం హోటల్లోనే ఉంటున్నారట. తరుచుగా ముంబైకి వెళ్తున్నా అక్కడ వాళ్ళు ఇల్లు కొనుక్కోలేదు. కొనడం క్షణాల్లో పని. కానీ, అక్కడ స్థిరపడే ఆలోచన లేనప్పుడు ఎందుకు కొనడం అనుకుంటున్నారు కాబోలు.
రామ్ చరణ్, ఉపాసనలకు హైదరాబాద్ లో కాకుండా చెన్నై, గోవాలో ఆస్తులు ఉన్నాయి. ఇక మెగాస్టార్ కుటుంబానికి బెంగుళూరు సమీపంలో ఒక పెద్ద ఫార్మ్ హౌజ్ కూడా ఉంది. ఐతే, ముంబైలో మాత్రం ఇప్పటివరకు ఇల్లు కొనలేదు.
పదేళ్ల క్రితం రామ్ చరణ్ బాలీవుడ్ లో ఒక మూవీ చేశాడు. ఆ సినిమా హిట్ ఐతే హిందీలో కెరీర్ కంటిన్యూ చేద్దామనుకున్నారు. ఆ టైంలో ముంబైలో ఒక ఇల్లు అద్దెకు తీసుకున్నారు. ఆ తర్వాత రెండేళ్లకి అది ఖాళీ చేసి మళ్ళీ ముంబై రాకపోకలు బంద్ చేశారు. ఇటీవల “ఆర్ ఆర్ ఆర్” విజయం సాధించాక దాదాపు ప్రతి నెల ముంబైకి వెళ్తున్నారు.