- Advertisement -

బిచ్చగాడు, బేతాళుడు వంటి విభిన్న చిత్రాలతో ఆకట్టుకున్న తమిళ హీరో విజయ్ ఆంటోనీ వరుసగా కొత్త సినిమాలతో మనముందుకు రానున్నారు. ‘హత్య’ అనే పేరుతో తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు మరోసారి.
ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ మూవీగా రూపొందుతున్న ఈ చిత్రంలో ఆయనది డిటెక్టివ్ పాత్ర. సంధ్య పోలీస్ అధికారిణిగా కనిపించనుంది రితికా సింగ్. లోటస్ పిక్చర్స్ తో కలిసి ఇన్ఫినిటీ ఫిలిం వెంచర్స్ సంస్థ నిర్మిస్తోంది. ఈ చిత్రానికి బాలాజీ కుమార్ దర్శకుడు.
ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ను బుధవారం విడుదల చేశారు. ఓ హత్య కేసు ఇన్వెస్టిగేషన్ కోసం కథానాయకుడు రంగంలోకి దిగినట్లు పోస్టర్ ద్వారా తెలుస్తున్నది.
“1923లో ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేసిన డోరతీ కింగ్ మర్డర్ ఘటన నేపథ్యంగా ‘హత్య’ సినిమా సాగతుంద,”ని మేకర్స్ చెప్తున్నారు.