సమంతపైనే చైతన్య అనుమానం!


సమంత, నాగ చైతన్య విడిపోయి దాదాపు ఏడాది కావొస్తోంది. ఎవరి జీవితాల్లో వారు మునిగిపోయారు. “మేము మూవ్ ఆన్ అయ్యాం. ఇంకా అన్నిటికి నన్నే బ్లేమ్ చేయొద్దు,” అని ఇటీవలే సమంత నాగ చైతన్య అభిమానులకు చురకలు అంటించింది సమంత.

ఐతే, చైతన్య అభిమానులు ఇంకా తగ్గడం లేదు. సమంత పైకి అమాయకురాలు అని కలర్ ఇస్తోంది కానీ ఆమె మహా ముదురు అని నాగ చైతన్య అభిమానులు సోషల్ మీడియాలో వాదిస్తున్నారు. చైతన్యకి మంచి పేరు రావడం ఆమెకి కుళ్లు అంటూ వాళ్ళు ట్విట్టర్ లో పోస్ట్ చేస్తున్నారు.

అభిమానుల గోల ఎలా ఉన్నా… నాగ చైతన్య కూడా సమంతపై గుర్రుగానే ఉన్నట్లు టాక్.

Naga Chaitanya

ఇటీవల తన లవ్ లైఫ్ గురించి ఒకేసారి బాలీవుడ్ మీడియాలో వార్తలు రావడం వెనుక సమంత ఉన్నట్లు నాగ చైతన్య బలంగా నమ్ముతున్నాడట. బాలీవుడ్ మీడియా పీఆర్ ఏజెన్సీల ద్వారా సమంత ఈ వార్తలు లీక్ చేయించిందని చైతన్య అనుకుంటున్నట్లు సమాచారం.

నాగ చైతన్య, హీరోయిన్ శోభిత డేటింగ్ లో ఉన్నారని ఇటీవల పుకార్లు షికార్లు చేశాయి. అటు చైతన్య, ఇటు శోభిత ఇద్దరూ ఈ వార్తలపై మౌనం వహించారు. అంతేకాదు, చైతన్య నటించిన ‘థాంక్యూ’ చిత్రం ఉన్నట్లుండి జులై 8 నుంచి వాయిదాపడింది. రెండు వారాలు వెనక్కి వెళ్ళింది. ఇవన్నీ లింక్ చేసుకుంటే మేటర్ ఏంటో అర్థం అవుతుంది.

తన సినిమా విడుదల సమయంలో సమంత కావాలనే ఇలాంటి రచ్చ లేపిందనేది నాగ చైతన్య అనుకుంటున్నట్లు ఇన్సైడ్ టాక్.

 

More

Related Stories