
హీరో వరుణ్ తేజ్, హీరోయిన్ లావణ్య త్రిపాఠి ఒక్కటి కాబోతున్నారు. నిన్న వీరి నిశ్చితార్థం జరిగింది. నాగబాబు ఇంట్లో సింపుల్ గా కుటుంబ సభ్యుల సమక్షంలో ఎంగేజ్ మెంట్ జరుపుకున్నారు. ఐతే, వీరి డేటింగ్ నిన్నామొన్నా మొదలైంది కాదు.
“2016లోనే మనసిచ్చాను వరుణ్ కి,” అంటోంది లావణ్య త్రిపాఠి.
మొదటిసారిగా వీరిద్దరూ ‘మిస్టర్’ అనే సినిమా షూటింగ్ లో కలుసుకున్నారు. శ్రీను వైట్ల డైరెక్షన్ లో 2016లో ఈ సినిమా షూటింగ్ మొదలైంది. అప్పుడే ఆమె ప్రేమలో పడింది. ఆ విషయాన్నీ తాజాగా ఇన్ స్టాగ్రామ్ లో పెట్టింది. 2016లో మా మనసులు ముడిపడ్డాయి అన్నట్లుగా రాసుకొంది. ఇన్నాళ్ల ప్రేమ ఇప్పుడు పెళ్లి వరకు వచ్చింది.
ఇటలీలో వీరి పెళ్లి జరుగుతుంది అని టాక్. ముహుర్తాలు ఫిక్స్ చేసుకొని ఇటలీలో ఒక రిసార్ట్ బుక్ చేసుకొని పెళ్లి పనులు మొదలు పెడుతారు.
ALSO CHECK: Varun Tej and Lavanya Tripathi get engaged