హెబ్బా మెడలో తాళి!

Hebah Patel

ఊహించని విధంగా మెడలో పసుపు కొమ్ముతో ప్రత్యక్షమైంది హీరోయిన్ హెబ్బా పటేల్. అది కనిపించేలా ఆమె ఫొటోలకు పోజులు కూడా ఇచ్చింది. దీంతో అంతా దానిపైనే చర్చించుకోవడం మొదలుపెట్టారు.

హెబ్బాకు ఆల్రెడీ 30 ఏళ్లు దాటిపోయాయి. కాబట్టి ఆమె పెళ్లి చేసుకుంటే పెద్దగా ఆశ్చర్యపోనక్కర్లేదు. పైగా ఆమెకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడనే పుకార్లు కూడా ఉన్నాయి కాబట్టి పెళ్లి అనేది జస్ట్ ఫార్మాలిటీ మాత్రమే. అయితే ఇలా మెడలో పసుపు కొమ్ము వేసుకోవడం మాత్రం ఆశ్చర్యమే.

పేదవాళ్లు మాత్రమే తాళి బొట్టు స్థానంలో ఇలా పసుపు కొమ్ము కట్టుకుంటారు. హెబ్బాకు అంత ఖర్మ పట్టలేదు. ఆమె తలుచుకుంటే చాలా డబ్బు పెట్టి, డిజైనరీ మంగళసూత్రమే తయారుచేయించుకోగలదు.

మరి ఈ పసుపు కొమ్ము కథ ఏంటనుకున్నారా..? ఆమె ప్రస్తుతం “ఓదెల రైల్వేస్టేషన్” అనే సినిమా చేస్తోంది. ఆ సినిమాలో పేదింటి పిల్లగా, ఎలాంటి మేకప్ లేకుండా కనిపించబోతోంది హెబ్బా. అందులో ఓ పెళ్లి సీన్ కోసమే ఇలా మెడలో పసుపు కొమ్ముతో కనిపించింది. షాట్ గ్యాప్ లో తీసిన ఈ ఫొటో పుకార్లకు కేంద్రబిందువైంది.

Related Stories