చివరాఖరి అవకాశం అదే

Hebah Patel

రోజులు బాగాలేకపోతే తాడు పట్టుకున్నా పాము అవుతుందని ఓ సామెత. హెబ్బా పటేల్ కు ఇప్పుడిలాంటి రోజులే నడుస్తున్నట్టున్నాయి. ఆమె ఏ సినిమా చేస్తే అది బాల్చీ తన్నేస్తోంది. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ఆమెకున్న ఒకే ఒక్క అవకాశం ‘రెడ్’.

మొన్నటివరకు “ఒరేయ్ బుజ్జిగా” సినిమాపై హోప్స్ పెట్టుకుంది హెబ్బా. తనకు కలిసొచ్చిన హీరో రాజ్ తరుణ్ కూడా ప్రాజెక్టులో ఉండడంతో సెంటిమెంట్ కొద్దీ అది హిట్టయిపోతుందని అనుకుంది. కానీ ఇంతకుముందే చెప్పుకున్నట్టు హెబ్బా రోజులు బాగాలేవు.

రీసెంట్ గా ఓటీటీలో రిలీజైన “ఒరేయ్ బుజ్జిగా” దుకాణం సర్దేసింది. ఈ సినిమాకు లక్షల వ్యూస్ వచ్చాయని సదరు యాప్ ‘ఆహా’ ఓహో అంటూ గొప్పలు చెప్పుకుంటున్నప్పటికీ సినిమా తేలిపోయిందనేది వాస్తవం. దీంతో హెబ్బ పటేల్ పరిస్థితి మళ్లీ మొదటికొచ్చింది.

ఇప్పుడు ఈ గుజరాతీ పిల్లకి ఉన్న ఒకే ఒక్క ఆశాదీపం ‘రెడ్’. రామ్ హీరోగా నటించిన ఈ సినిమా తన కెరీర్ కు కాస్త ఆక్సిజన్ అందిస్తుందని హెబ్బా గంపెడాశలు పెట్టుకుంది. ఇంతా చేసి ఈ సినిమాలో ఆమె హీరోయిన్ కాదు, జస్ట్ ఐటెంసాంగ్ చేసిందంతే.

Related Stories