- Advertisement -

హెబ్బా పటేల్ చాలా గ్యాప్ తర్వాత ఒక కొత్త సినిమా ఒప్పుకొంది. ‘కుమారి 21F’ సినిమాతో పాపులరయి ఆ తర్వాత అనేక సినిమాల్లో నటించిన హెబ్బా ఇటీవల సినిమాలు తగ్గించింది.
రామ్ కార్తీక్ అనే వర్ధమాన హీరో సరసన కొత్త సినిమాలో నటించింది. ఈ సినిమా పేరు…. “తెలిసిన వాళ్లు”.
విప్లవ్ కోనేటి ఈ సినిమాని నిర్మించి, డైరెక్ట్ చేస్తున్నారు. దీనికి సంబంధించిన గ్లింప్స్ విడుదలైంది. శ్రీ చరణ్ పాకాల సంగీతం అందిస్తున్నారు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పజరుపుకుంటోంది. సినిమాలో విఎఫ్ఎక్స్ అద్భుతంగా ఉంటుందని చెప్తున్నారు మేకర్స్.
హెబ్బా పటేల్ ఒకప్పుడు గ్లామర్ రోల్స్ పోషించింది. ఇప్పుడు పక్కింటి అమ్మాయి పాత్రలోకి వచ్చింది. మరి ఈ ‘తెలిసిన వాళ్ళు’ ఆమెకి మరిన్ని అవకాశాలు తెచ్చిపెడుతుందా అనేది చూడాలి.