హేమపై జోరుగా ట్రోలింగ్

Hema

టాలీవుడ్ నటి హేమ ఇటీవల తిరుపతిలో ఎన్నికల ప్రచారంలో పాల్గొంది. ఈ నెల 17న తిరుపతి లోక్ సభ ఉప ఎన్నకలు జరగనున్నాయి. బీజేపీ అభ్యర్థి రత్నప్రభని గెలిపించాలని హేమ ప్రచారం చేసింది. ఆ సందర్భంగా ఆమె చేసిన కామెంట్ ట్రోలింగ్ కి గురవుతోంది. ఇప్పుడు సోషల్ మీడియాలో అదే ట్రెండింగ్ టాపిక్.

ఇంతకీ హేమ ఏమి కామెంట్ చేసిందంటే…

“మీరు అందరూ ఓటు వేసి లోకసభ అభ్యర్థి రత్నప్రభ గారిని అసెంబ్లీకి పంపండి,” అని హేమ ప్రచారం చేసింది. “లోక్ సభ అభ్యర్థిని అసెంబ్లీకి పంపాలా అక్కా…” అంటూ ట్రోలింగ్ షురూ అయింది.

హేమ ఇంతకుముందు జై సమైక్యాంధ్ర పార్టీలో పని చేసింది. ఆ తర్వాత వైఎస్సార్సీపీలో చేరింది. ఇప్పుడు బీజేపీ కండువా వేసుకొంది. ఆమె పార్టీలు మారడం కన్నా ఆమె స్పీచులు ఎక్కువ ట్రోలింగ్ కి మంచి స్టఫ్ గా మారుతుంటాయి.

More

Related Stories