- Advertisement -

క్యారెక్టర్ నటి హేమకి 53 ఏళ్ళు. ఆమె కూతురు పెళ్ళీడుకొచ్చింది. ఆమె చేసే పాత్రలు అమ్మ, ఆంటీ వంటివే. కానీ తనని హీరోలు ఎవరైనా ఆంటీ అని పిలిస్తే నచ్చదు అని చెప్తోంది. హీరోలనే కాదు ఎవరైనా… ఆంటీ అంటే ఇబ్బందిగా ఉంటుందిట. ఇక హీరోలు అలా సంభోదిస్తే మరింత వయసు పెరిగిపోయిన ఫీలింగ్ వస్తుందని చెప్తోంది హేమ.
మొన్నామధ్య హేమ తన భర్త బర్త్ డేని స్విమ్మింగ్ పూల్లో జరిపింది. భర్తకి లిప్ టు లిప్ కిస్ ఇచ్చి ఆ వీడియోని ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. ఈ వయసులో కూడా ఇంత రొమాంటిక్ గా ఉండే హేమ… తాను యంగ్ ఫరెవర్ అంటోంది.
ఇటీవల ‘షాదీ ముబారక్’ సినిమాలో హీరో సాగర్ కి తల్లిగా నటించింది. ఆమె వదిన పాత్రలనుంచి హీరోలకు తల్లిగా నటించే పాత్రలకు షిఫ్ట్ అయింది.