రవితేజ టార్గెట్ పెరిగింది

- Advertisement -
Khiladi

హీరో రవితేజకి మొదటినుంచి బాగా సంపాదించాలనే కోరిక ఉంది. తక్కువ టైములో ఎక్కువ చిత్రాలు చేస్తూ కోట్లు కోట్లు గడించారు రవితేజ. ‘క్రాక్’ విడుదలకి ముందు కొంత బ్రేక్ పడింది. కానీ, ఇప్పుడు మళ్ళీ టార్గెట్ పెంచుకున్నాడట.

వచ్చే రెండు, మూడేళ్ళలో 150 కోట్ల సంపాదన లక్ష్యంగా పెట్టుకున్నాట్ట. ప్రస్తుతం సినిమాకి 17 కోట్లు తీసుకుంటున్నారు. గెస్ట్ రోల్ కి 8 కోట్లు. ‘రామారావు ఆన్ డ్యూటీ’, ‘ధమాకా’, ‘టైగర్ నాగేశ్వరరావు’, చిరంజీవి ‘వాల్తేర్ వీరయ్య’ (గెస్ట్ రోల్) సినిమాలు లైన్లో ఉన్నాయి. ఈ చిత్రాలతో ఒక 60 కోట్లు వస్తాయి. ఈ సినిమాల కమిట్మెంట్స్ అన్ని ఈ ఏడాది అక్టోబర్ నాటికి పూర్తి అవుతాయి.

ఆ తర్వాత మరో ఐదు సినిమాలు వరుసగా లైన్ లో పెడతారట. అలా 150 కోట్ల సంపాదన టార్గెట్ రీచ్ అవుతారు.

ఇప్పుడు పెద్ద హీరోలు సినిమాకి 50 కోట్ల రేంజుకి వెళ్లారు. దాంతో, తాను ఇలా టార్గెట్ ఫిక్స్ చేసుకున్నారు. వేగంగా సినిమాలు పూర్తి చేసి పెద్ద హీరోలకు మించి సంపాదిస్తున్నారు రవితేజ.

 

More

Related Stories