ఎన్ని షర్ట్ లకి అలా వేశారో!

- Advertisement -


రాజమౌళి తీసీన ‘ఆర్ ఆర్ ఆర్’ సినిమా జనవరి 7, 2022న విడుదల కానుంది. కానీ ఈ సినిమాకి పెద్ద ఎత్తున ప్రమోషన్స్ నిర్వహిస్తున్నారు రాజమౌళి. ఇప్పటికే హైదరాబాద్, చెన్నై, కొచ్చిన్, బెంగళూరు, ముంబైలలో ప్రెస్ మీట్స్ ఒక రౌండ్ పూర్తి చేశారు. నిన్న ఆదివారం ముంబైలో ప్రీ రిలీజ్ ఈవెంట్, ఈ రోజు మీడియాతో ఇంటర్వ్యూలు జరిగాయి.

త్వరలో మరో 10 నుంచి 20 ఈవెంట్స్, ప్రెస్ మీట్స్ ఉంటాయి. ఐతే, ఈ సినిమాకి సంబంధించి ఎన్ని ప్రొమోషనల్ కార్యక్రమాలు జరిగినా హీరో ఎన్టీఆర్, హీరో రామ్ చరణ్, దర్శకుడు రాజమౌళి “ఆర్ ఆర్ ఆర్” లోగోతో కూడిన షర్ట్ లు మాత్రమే ధరించాలని నియమం పెట్టుకున్నట్లు కనిపిస్తోంది.

వారు వేసుకునే షర్ట్ పై RRR అనే టైటిల్ లోగో కుట్టించి ఉంటుంది. హీరోల కోసం, తన కోసం రాజమౌళి ఎన్ని షర్ట్ లు అలా కుట్టించారో?

రాజమౌళి సినిమా మేకింగ్ లోనే కాదు, మార్కెటింగ్ లో కూడా ఇలాంటివి అనేకం చేస్తుంటారు. ఆయనదో శైలి. వేరే దర్శకుడు ఎవరైనా ఇలాంటి యూనిఫార్మ్ లాంటి షర్ట్ లు వేసుకోమని అడిగితే హీరోలు వీరంగం వెయ్యడం గ్యారెంటీ. కానీ రాజమౌళి సినిమా విషయంలో అలా జరగదు. అందుకే… ఎన్ని షర్ట్ లకి అలా లోగో వేసి కుట్టించి పెట్టారో మనం లెక్కపెట్టాలి ఇక.

 

More

Related Stories