సంపాదన ఫ్రమ్ హోమ్

Nidhi, Shruti and Adah

హీరోయిన్లంతా ఇప్పుడు రెండు గ్రూపులయ్యారు. బయటకొచ్చి షూటింగ్స్ చేసే వెసులుబాటు లేకపోవడంతో.. సంస్థలు కూడా వినూత్నంగా ఆలోచిస్తూ స్టార్స్ తో యాడ్స్ చేస్తున్నాయి. ఇందులో భాగంగా ఈ సీజన్ లో ఏరియల్, టైడ్ యాడ్స్ అందర్నీ ఆకట్టుకుంటున్నాయి.

ఏరియల్ కోసం స్టార్ కపుల్స్ ను సెలక్ట్ చేసుకుంది ఆ సంస్థ. ఈమధ్య నమ్రత-మహేష్ కలిసి వాషింగ్ మెషీన్ వద్ద నవ్వుతూ ఫొటోలకు పోజిస్తే అది క్యాజువల్ స్టిల్ అనుకున్నారంతా. కానీ జాగ్రత్తగా గమనిస్తే అక్కడ ఏరియల్ వాష్ పౌడర్ డబ్బా కనిపించింది. దాదాపు ఇదో పోజును సమంత-నాగచైతన్య కూడా ఇవ్వడంతో అప్పుడు అసలు విషయం జనాలకు అర్థమైంది.

ఇలా సెలబ్రిటీ కపుల్స్ ను టార్గెట్ చేస్తూ తమ బ్రాండ్ కు ప్రచారం చేస్తోంది ఏరియల్. ఇప్పుడు దీనికి పోటీగా టైడ్ రెడీ అయింది. వీళ్లు ఇంకాస్త వెరైటీగా హీరోయిన్లతో టైడ్ మీమ్స్ చేయిస్తున్నారు. ఇవి సోషల్ మీడియాలో బాగా పాపులర్ అవుతున్నాయి. టైడ్ యాడ్ కు హీరోయిన్లు తమ స్టయిల్ యాడ్ చేయడం ఇక్కడ స్పెషాలిటీ.

ఇప్పటికే హీరోయిన్లు అదాశర్మ, శృతిహాసన్, నిధి అగర్వాల్, జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ఈ విధంగా టైడ్ కు ప్రమోషన్ ఇచ్చారు. మొత్తమ్మీద షూటింగ్స్ లేకపోవడంతో హీరోయిన్లు ఇలా సైడ్ ఇన్ కమ్ మీద పడ్డారు. ఇంట్లో ఉంటూనే డబ్బు సంపాదిస్తున్నారు. వీళ్ల దృష్టిలో వర్క్ ఫ్రమ్ హోమ్ అంటే ఇదేనేమో

Related Stories