పెన్ను పట్టుకుంటున్న హీరోయిన్లు

Rashmika, Radhika Apte, Nithya Menen

ఈ లాక్ డౌన్ టైమ్ లో హీరోయిన్లలో ఉన్న కొత్త కొత్త టాలెంట్స్ బయటకొస్తున్నాయి. పాయల్ రాజ్ పుత్ అయితే ఈ లాక్ డౌన్ టైమ్ లో ఏకంగా ఓ షార్ట్ ఫిలింలో నటించింది. రాశిఖన్నా గిటార్ నేర్చుకుంది. ఇలా చాలామంది తమ అభిరుచుల్ని బయటపెట్టారు. అయితే ఓ ముగ్గురు ముద్దుగుమ్మలు మాత్రం రైటింగ్ తో పాటు డైరక్షన్ పై తన ఇంట్రెస్ట్ ను చాటుకున్నారు.

ఈ లాక్ డౌన్ టైమ్ లో లండన్ లో ఉన్న రాధికా ఆప్టే.. కొన్ని కథలు రాయడం స్టార్ట్ చేసింది. తను రాస్తున్న కథలు ఏ షేప్ తీసుకుంటాయో తనకు తెలీదు కానీ, ఫైనల్ వెర్షన్ తనకు నచ్చితే మాత్రం దర్శకత్వం వహించే ఆలోచనలో ఉన్నట్టు ఈ ముద్దుగుమ్మ బయటపెట్టింది. పుస్తకాల పురుగుగా పేరున్న ఈ ముద్దుగుమ్మ.. లాక్ డౌన్ టైమ్ లో రీడింగ్ కంటే రైటింగ్ కే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చానంటోంది.

రాధిక ఆప్టే కంటే ముందే ఈ పని ప్రారంభించింది నిత్యామీనన్. నటించడంతో పాటు రాయడం ఈమెకు హాబీ. అలా ఇప్పటికే కొన్ని కవితలు, కథానికలు రాసింది. ఈ లాక్ డౌన్ టైమ్ లో ఏకంగా ఓ సినిమా స్క్రిప్ట్ రాసినట్టు ప్రకటించింది నిత్యామీనన్. ఏ జానర్ కు చెందిన కథ రాసిందనే విషయాన్ని బయటపెట్టలేదు కానీ భవిష్యత్తులో మెగాఫోన్ పట్టుకునే అవకాశాలు మాత్రం ఉన్నాయని అంటోంది.

తాజాగా ఈ లిస్ట్ లోకి చేరిన మరో ముద్దుగుమ్మ రష్మిక. ఈమె పేరు చెప్పగానే మనకు స్వీట్ ఎక్స్ ప్రెషన్స్, క్యూట్ స్టెప్పులు మాత్రమే గుర్తొస్తాయి. కానీ తనలో అంతకుమించి ఉందని చెప్పకనే చెబుతోంది రష్మిక. రీసెంట్ గా ఈ ముద్దుగుమ్మ ఇనస్టాగ్రామ్ లో ఓ పోస్ట్ పెట్టింది. ఓ చిన్న కథ రాసుకొచ్చింది. అది చూసిన నెటిజన్లు, రష్మికలో కూడా మంచి రచయిత ఉందంటూ ఆమెను మెచ్చుకున్నారు.

ఇలా ఈ లాక్ డౌన్ టైమ్ లో కొంతమంది హీరోయిన్ల తమ రైటింగ్ టాలెంట్ ను కూడా బయటపెట్టారు.

Advertisement
 

More

Related Stories