‘ఖుషి’ మ్యూజికల్ హిట్: హేషమ్

- Advertisement -
Hesham Abudl

మలయాళంలో సూపర్ హిట్ అయిన “హృదయం” సినిమాతో పాపులర్ అయ్యారు కేరళకి చెందిన యువ సంగీత దర్శకుడు హేషమ్ అబ్దుల్ వాహబ్. ఆ సినిమాల పాటలు చూసిన దర్శకుడు శివ నిర్వాణ హేషమ్ ని తెలుగు తెరకు పరిచయం చెయ్యాలని డిసైడ్ అయ్యారు. అలా ‘ఖుషి’ సినిమాతో ఎంట్రీ ఇస్తున్నారు హేషమ్. విజయ్ దేవరకొండ, సమంత జంటగా నటించిన ‘ఖుషి’ సినిమా పాటలు ఇప్పటికే బాగా పాపులర్ అయ్యాయి.

తన తెలుగు చిత్రాల ప్రయాణం గురించి హేషమ్ ముచ్చట్లు….

మొదటి చిత్రమే మ్యూజికల్ హిట్

“హృదయం” కేరళలో హిట్ కాగానే మైత్ర సంస్థ, దర్శకుడు శివ నిర్వాణ నుంచి పిలుపు వచ్చింది. శివ చెప్పిన కథతో బాగా ఎక్సయిట్ అయ్యాను. మొత్తం అయిదు పాటలు దేనికవే భిన్నంగా ఉండేలా ప్లాన్ చేశాం. వీణ, సితార వంటి సంప్రదాయ భారతీయ సంగీత పరికరాలు ఎక్కువగా వాడాం. దర్శకుడు శివ నిర్వాణ, నేను ఒక హోటల్ లో తిష్ట వేశాం. నెల రోజుల మ్యూజిక్ సిట్టింగ్ లో అన్ని ట్యూన్స్ ఓకె అయిపోయాయి. ఒక సినిమాకి ఇన్ని రోజుల సిట్టింగ్స్ వెయ్యడం నాకు ఇదే ఫస్ట్ టైం.

పాటల థీమ్

“నా రోజా నువ్వే” పాటలో మణిరత్నం టైటిల్స్ రావాలనేది దర్శకుడు శివ నిర్వాణ ఆలోచన. ఈ సినిమాలో హీరో మణిరత్నం, సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ అభిమాని. సో… శివ నిర్వాణ స్వయంగా లిరిక్స్ రాశారు. ఆ పాట బాగా క్లిక్ అయింది. ఒక్కో పాట ఒక్కో థీమ్ అనుకోని చేశాం. హీరో విజయ్ కు కూడా సంగీతం విషయంలో మంచి అభిరుచి ఉంది. ఆయన ఇచ్చిన సలహాలు కూడా బాగా హెల్ప్ అయ్యాయి. అన్ని పాటలు రిలీజ్ కు ముందే సూపర్ గా పాపులర్ అయ్యాయి. సినిమా కూడా మ్యూజికల్ బ్లాక్ బస్టర్ అవుతుంది.

తెలుగులో బిజీ బిజీ

తెలుగు సినిమా పరిశ్రమ నన్ను ఘనంగా ఆహ్వానించింది. అవకాశాలు బాగున్నాయి. నాని హీరోగా నటిస్తున్న “హాయ్ నాన్న” చిత్రానికి ఇప్పటికే పని మొదలైంది. షూటింగ్ జరుగుతోంది. శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో శర్వానంద్, కృతి శెట్టి నటిస్తున్న సినిమాకు కూడా మ్యూజిక్ అందిస్తున్నాను.

కీరవాణి సంగీతం ఇష్టం

తెలుగులో కీరవాణి, మిక్కీ జే మేయర్, భీమ్స్ మ్యూజిక్ ఇష్టం.

 

More

Related Stories