
డిసెంబర్ 22/23న విడుదల కావాల్సిన చిత్రాల్లో “సైంధవ్” వాయిదా పడింది. జనవరి 13, 2024న విడుదల కానుంది. నితిన్ హీరోగా రూపొందుతోన్న “ఎక్స్ట్రార్డినరీమేన్” చిత్రం డిసెంబర్ 8న రానుంది. కానీ, మూడో చిత్రం “హాయ్ నాన్న” ఇంకా కొత్త డేట్ ప్రకటించలేదు.
ఈ సినిమా “సలార్”తో డిసెంబర్ 22న పోటీపడదు. మరి కొత్త డేట్ ఏంటి? ఈ విషయంలో క్లారిటీ ఇవ్వనుంది టీం. ఈనెల 15న “హాయ్ నాన్న” టీజర్ విడుదల అవుతుంది. అప్పుడే కొత్త రిలీజ్ డేట్ కూడా ప్రకటిస్తారు. అప్పటివరకు సస్పెన్స్ తప్పదు.
నాని హీరోగా నటించిన ఈ సినిమాలో మృణాల్ ఠాకూర్ హీరోయిన్. తండ్రి, కూతుళ్ళ డ్రామా ఇది. కియారా ఖన్నా అనే చిన్నారి ఈ సినిమాలో నానికి కూతురిగా నటించింది.
నాని ఈ ఏడాది “దసరా” సినిమాతో మంచి విజయం అందుకున్నారు. “హాయ్ నాన్న”తో కూడా సక్సెస్ మేజిక్ రిపీట్ చేస్తాను అని కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. ఈ సినిమాలోని మొదటి పాట “సమయమా” బాగా వైరల్ కావడంతో నానికి మరింత నమ్మకం కుదిరింది.