- Advertisement -

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటే సినిమా నటులకి కూడా పిచ్చి. ఆయన అంటే యమా అభిమానం ఉన్నవారిలో నటి హిమజ ఒకరు. సినిమాల్లో హీరోయిన్ ఫ్రెండ్ పాత్రల్లో ఎక్కువగా కనిపించే హిమజ… బిగ్ బాస్ షో మూడో సీజన్ లో పాల్గొని మరింతగా పాపులర్ అయింది. ఆమె ఇటీవల పవన్ కళ్యాణ్ ని కలిసింది…ఆటోగ్రాఫ్ అడిగింది.
ఐతే, పవన్ కళ్యాణ్ ఏకంగా ఆమె కోసం ఏకంగా పెద్ద నోట్ రాశారు.
ఆమె కెరీర్లో మరింత ఉన్నత శిఖరాలను అధిరోహించాలని విష్ చేస్తూ తెలుగులో నోట్ రాశారు పవన్ కళ్యాణ్. అంతే… హిమజ ఆనందానికి అవధుల్లేవు. “ఈ ఎమోజిలు కూడా నా ఆనందాన్ని వ్యక్తపరచలేవు,”అంటూ మురిసిపోతోంది ఈ భామ.