హిట్ 2లో హిట్ 3 హీరో!

Hit 2

‘హిట్’ సినిమాలో హీరో విశ్వక్ సేన్. ‘హిట్ 2’లో అడవి శేష్ హీరో. ఈ సినిమా డిసెంబర్ 2న విడుదల కానుంది. మొదటి భాగం హైదరాబాద్ లో జరిగితే రెండో భాగం వైజాగ్ లో జరగనుంది. త్వరలోనే మూడో భాగం రానుంది. కానీ, హీరోలు, లొకేషన్, పాత్రలు మాత్రం ప్రతి పార్ట్ లో మారుతాయి.

మూడో భాగంలో హీరో ఎవరు అనేది ఈ ‘హిట్ 2’ సినిమాలోనే హింట్ ఇస్తారట. ఆ హీరో ఎవరు అనేది సినిమా చివర్లో రివీల్ చేయ‌బోతున్నారు.

ఈ హిట్ సినిమాలకు సహ నిర్మాత నాని. అతనే మూడో భాగంలో ఉండొచ్చని ప్రచారం జరుగుతుంది. కానీ, అధికారికంగా సమాచారం తెలియాలంటే డిసెంబర్ 2 వరకు ఆగాలి.

‘హిట్ 3’ తోనే ఈ సిరీస్ ఆగిపోదు. దీన్ని అలా కంటిన్యూ చెయ్యాలనుకుంటున్నారు. అంటే ‘హిట్’ పేరుతో అనేక సినిమాలు వస్తాయి

 

More

Related Stories