కొత్త జంట కొత్త కాపురం

- Advertisement -

కత్రినా కైఫ్, హీరో విక్కీ కౌశల్ గతవారం పెళ్లి చేసుకున్నారు. ఈ జంట ఇప్పుడు కొత్త ఇంట్లో కాపురం పెట్టింది. ముంబైలోని జుహులో ఒక ఖరీదైన అపార్ట్ మెంట్ ని అద్దెకి తీసుకొని అందులో కాపురం పెట్టారు. ఆ ఇంట్లో నుంచి మొదటి ఫోటోని షేర్ చేసింది కత్రిన. పెళ్లిగాజులు తొడుక్కున్న తన చేతిని, విక్కీ చేతిలో వేసి ఫోటో తీసి దాన్ని ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. ఫొటోకి బీచ్ బ్యాక్డ్రాప్ అదిరింది.

“హోమ్,” అని ఈ ఫోటోకి క్యాప్సన్ రాసింది. నెలకు 10 లక్షల రెంట్ కడుతున్నారుట. పక్క అపార్ట్ మెంట్లో అనుష్క శర్మ, ఆమె భర్త విరాట్ కోహ్లీ ఉంటారు. కొత్త ఇంట్లోని కిటికీ వద్ద తమ చేతులను బయటపెట్టి తీసుకున్న ఈ ఫోటోని ఇన్ స్టాగ్రామ్ స్టోరీస్ లో షేర్ చేసింది.

ఈ ఫోటో బాగా వైరల్ అయింది.

38 ఏళ్ల కత్రిన, 33 ఏళ్ల విక్కీ కౌశల్ రెండేళ్ల పాటు డేటింగ్ చేశారు. ఆ తర్వాత పెళ్లి చేసుకొని ఇప్పుడు హనీమూన్ పయనం అయింది ఈ జంట. ఐతే, కత్రిన భర్త విక్కి మాత్రం పెళ్లి తర్వాత ఇంతవరకు ఒక్క ఫోటో కూడా అప్డేట్ చెయ్యలేదు. కత్రిన ఇప్పటికే పెళ్లి ఫోటోలు షేర్ చేసింది.

 

More

Related Stories