ఈ హానీకి ఇంకో సినిమా!

- Advertisement -
Honey Rose

హానీ రోజ్… కేరళకు చెందిన సుందరి. ఆమె వయసు, ఆ సొగసు… సీనియర్ హీరోలకు జోడిగానే బాగుంటుంది. అందుకే బాలయ్య సరసన “వీరసింహ రెడ్డి”లో నటించింది. ఐతే, ఆ సినిమా ఆడినా తెలుగులో మరో అవకాశం ఇప్పటివరకు రాలేదు. తాజాగా ఒక కొత్త సినిమాలో ఒక పాత్ర కోసం ఆమె పేరుని పరిశీలిస్తున్నారట.

ఈ కొత్త సినిమాలో కూడా 50 దాటిన హీరోనే ఉంటాడు అనేది టాక్. 50 ప్లస్, 60 ప్లస్ హీరోలు మనకు చాలా మందే ఉన్నారు. మరి ఎవరి చిత్రంలో ఈ హానీకి అవకాశం రానుందో.

మరోవైపు, హానీ రోజ్ ఇన్ స్టాగ్రామ్ లో పాపులారిటీ పెంచుకుంటోంది. ప్రతి రోజూ ఈ రోజ్ కొత్త ఫోటోలు అప్డేట్ చేస్తూ ఉంటుంది. అలా ఫాలోవర్స్ పెరుగుతున్నారు. ఇన్ స్టాగ్రామ్ సంపాదన, బ్రాండ్ ల ద్వారా ఆర్జన బాగానే ఉంది కానీ సినిమాల్లో నటిస్తేనే క్రేజ్. అందుకే, ఈ భామ మళ్ళీ తెలుగులో ఒక అవకాశం పొందేందుకు ప్రయత్నిస్తోంది. ఆ ప్రయత్నాలు ఫలించనట్లే అని అంటున్నారు.

33 ఏళ్ల ఈ సుందరికి మలయాళంలో మాత్రం అడపాదడపా అవకాశాలు వస్తూనే ఉన్నాయి.

 

More

Related Stories