బాలయ్య వల్ల ఫెమసైన హనీరోజ్

Honey Rose

బాలయ్య వల్ల ఫెమసైన హనీరోజ్నిన్న మొన్నటివరకు హనీరోజ్ పేరు తెలుగువారికి పెద్దగా తెలియదు. మలయాళంలో ఆమె పేరున్న నటి. బోల్డ్ గా నటిస్తుంది. అక్కడ చాలా సినిమాలు చేసినా తెలుగు దర్శకులు, నిర్మాతలు ఆమెని తీసుకునేందుకు పెద్దగా ఆసక్తి చూపలేదు.

ఐతే, మొదట బోయపాటి శ్రీను ఆమెని పరిచయం చేసేందుకు ఇంటరెస్ట్ చూపించారు. నందమూరి బాలకృష్ణ సరసన “అఖండ” సినిమాలో హనీరోజ్ ని తీసుకున్నారు. కానీ కొన్ని రోజుల షూటింగ్ తర్వాత బోయపాటికి ఆమె నటన నచ్చలేదు. అలా హనీరోజ్ ‘అఖండ’ సినిమా మిస్ అయింది. ఐతే, బాలయ్య ఆమెని గుర్తుపెట్టుకొని మరీ ‘వీరసింహారెడ్డి’లో అవకాశం ఇచ్చారు. ‘వీరసింహారెడ్డి’లో ఆమె బాలయ్య భార్యగా నటించి గుర్తింపు తెచ్చుకొంది.

ఐతే, సినిమాల్లో నటించిన పాత్ర కన్నా బాలయ్యతో ప్రైవేట్ పార్టీలో చేసిన సందడి వల్ల హనీరోజ్ కి ఎక్కువ క్రేజ్ వచ్చింది. బాలయ్యతో ఆమె సినిమా సక్సెస్ పార్టీలో చేసిన హడావుడి, బాలయ్యతో కలిసి సాంపెన్ పెగ్గులు వేసిన తీరు సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది.

అలా ఆమె పేరు ప్రస్తుతం తెగ మార్మోగిపోతోంది. ‘వీరసింహారెడ్డి’లో బాలయ్య సరసన నటించిన శృతి హాసన్ కన్నా రెండో హీరోయిన్ గా నటించిన హనీరోజ్ కే ఎక్కువ పాపులారిటీ వచ్చింది.

Balakrishna and Honey Rose

బాలయ్య, హనీరోజ్ కాంబినేషన్ ని మళ్ళీ రిపీట్ చేస్తారనే రూమర్లు కూడా మొదలయ్యాయి అంటే ఏ రేంజ్ లో ఆమె ట్రెండ్ అయిందో అర్థం చేసుకోవచ్చు.

 

More

Related Stories