తీసుకున్నదే కొసరు, ఎలా ఇస్తాడు?

Vijay Deverakonda


పూరి జగన్నాధ్ తన కొత్త సినిమాని ప్రకటించారు. ‘డబుల్ ఇస్మార్ట్’ పేరుతో రామ్ హీరోగా ‘ఇస్మార్ట్ శంకర్’కి సీక్వెల్ తీస్తున్నట్లు ప్రకటించారు. మరోవైపు, గతేడాది పూరి తీసి విడుదల చేసిన ‘లైగర్’తో నష్టపోయిన బయ్యర్లు, ఎగ్జిబిటర్లు తమకు న్యాయం జరగాలని హైదరాబాద్ లో దీక్ష చేపట్టారు. దాంతో, హీరో విజయ్ దేవరకొండ కూడా కొంత అమౌంట్ తిరిగి ఇస్తే ఏమి పోయింది అంటూ కొన్ని మీడియా సంస్థలు, సోషల్ మీడియా హ్యాండిల్స్ ప్రశ్నలు వేస్తున్నాయి.

కానీ, విజయ్ దేవరకొండ తిరిగి ఎలా చెల్లిస్తాడు? అతను కూడా బాధితుడే.

“లైగర్” సినిమాని, పూరిని బలంగా నమ్మి విజయ్ దేవరకొండ సినిమా విడుదల వరకు పెద్దగా పారితోషికం తీసుకోలేదట. ముందు చేసుకున్న ఒప్పందంలో కేవలం 25, 30 శాతం మాత్రమే తీసుకున్నాడట. విడుదల తర్వాత సినిమా దారుణంగా పరాజయం పొందడంతో పూరి, ఛార్మి మిగతా డబ్బు హీరోకి చెల్లించలేదు. సో, విజయ్ బయ్యర్లుకి ఎలా చెల్లిస్తాడు? ఆయన కూడా భారీగా నష్టపోయాడు కదా అనేది విజయ్ దేవరకొండ టీం చెప్తున్న మాట.

“లైగర్” మిగిల్చిన ఇలాంటి కష్టాలు ఎన్నో ఉన్నాయి.

 

More

Related Stories