
సడెన్ గా సోమవారం తన పెళ్లి ఫోటోలను విడుదల చేసింది హీరోయిన్ ప్రణీత. నిన్న రాత్రి వరకు బెంగుళూరు మీడియా వారికి కూడా ఆమె పెళ్లి గురించి సమాచారం లేదంట. అంత గప్ చుప్ గా పెళ్లి పనులు చక్కబెట్టింది ఈ బ్యూటీ.
ఆదివారం (మే 30, 2021) నాడు ప్రణీత పెళ్లి చేసుకొంది. బెంగుళూరులోని ప్రణీత ఇంట్లోనే ఈ వివాహ వేడుక సింపుల్ గా జరిగింది. కేవలం ఇరువైపులా కుటుంబ సభ్యులు మాత్రమే హాజరయ్యారు. లాక్డౌన్ కారణంగా ఎటువంటి హడావిడి లేకుండా జరిగింది.
Also Read: Pranitha gets married to Nithin Raju
సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉండే ప్రణీత పెళ్లికి ముందు ఒక్కసారి కూడా నితిన్ గురించి ఎక్కడా చెప్పలేదు. వీరిద్దరూ కలిసి ఉన్న ఫోటోలు కూడా రాలేదు. ఐతే, పెళ్లి చేసుకోవాలన్న నిర్ణయం రాత్రికి రాత్రి తీసుకున్నది కాదు.
“నితిన్ నాకు చాలా కాలంగా తెలుసు. మా పెద్దలు ఆరెంజ్ చేశారు. మేమిద్దరం ఒకరినొకరం ఇష్టపడి పెళ్లి చేసుకున్నాం. ఐతే, శనివారం వరకు పెళ్లి జరుగుతుందా లేదా అనేది డౌట్ గా ఉండింది. చివరి నిమిషంలో పోలీసులు అనుమతి ఇచ్చారు. అలా మా పెళ్లి జరిగింది,” అని ప్రణీత మీడియాకు తెలిపింది.