సమంత ఎలా బయటపడుతుంది?

- Advertisement -
Samantha

సమంత పుట్టింది తమిళనాడులో. ఇప్పుడు తెలుగింటి కోడలు అయింది కానీ సమంత జన్మత: తమిళ పొన్ను. అయినా సమంతకి తమిళీయుల నుంచి సెగ తప్పడం లేదు. ‘ది ఫ్యామిలీ మేన్ 2’ ట్రైలర్ వచ్చినప్పటి నుంచి తమిళీయులు ఆమె మీద మండిపండుతున్నారు. ఈ వెబ్ సిరీస్ లో ఆమె తీవ్రవాదిగా నటించింది.

‘ఎల్టీటీఈ’ని తీవ్రవాద సంస్థ అంటే తమిళీయులు ఒప్పుకోరు. శ్రీలంకలోని తమిళీయుల కోసమే పోరాడిన ఎల్టీటీఈతో వారికి ఎమోషనల్ బంధం ఉంది. అందుకే, సమంత తీవ్రవాదిగా, నెగెటివ్ గా కనిపించడంతో ఈ వెబ్ సిరీస్ తమిళ ప్రజలకు వ్యతిరేకం అని సోషల్ మీడియాలో చర్చ మొదలైంది. సమంతకి వ్యతిరేకంగా, ఈ వెబ్ సిరీస్ కి ట్రోలింగ్ జోరుగా సాగుతోంది.

మరి సమంత ఈ వివాదం నుంచి ఎలా బయటపడుతుంది?

Also Read: డేంజర్ కి కొత్త ఫేస్ సమంత!

సమంత అక్కినేని ప్రస్తుతం తమిళ్ లో ఒకే ఒక్క మూవీ చేస్తోంది. అందులో నయనతార కూడా హీరోయిన్. నయనతార కాబోయే భర్త ఆ సినిమాని డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ వివాదం ముదిరితే సమంతకి ఈ సినిమా విషయంలో ఇబ్బంది వస్తుంది. త్వరలోనే సమంత నుంచి ఎదో ఒక ప్రకటన రావొచ్చు.

 

More

Related Stories