
బాలీవుడ్ హీరో, అందగాడు హృతిక్ రోషన్ మళ్ళీ డేటింగ్ ప్రపంచంలోకి అడుగుపెట్టినట్లు కనిపిస్తోంది. లేటెస్ట్ గా ఆయన నటి, సింగర్ సబా ఆజాద్ తో తరుచుగా కనిపిస్తున్నారు. ఇటీవల ముంబైలో ఒక రెస్టారెంట్ లో డిన్నర్ చేసిన వీడియో బాగా వైరల్ అయింది.
సబా ఆజాద్ ప్రస్తుతం “రాకెట్ బాయ్స్” అనే వెబ్ సిరీస్ లో నటిస్తోంది. ఆమెకి 32 ఏళ్ళు.
హృతిక్ రోషన్ ఏడేళ్ల క్రితం తన భార్య సుజానే నుంచి విడిపోయాడు. ఈ గ్యాప్ లో వాళ్లిద్దరూ మళ్ళీ కలిసేందుకు ప్రయత్నాలు జరిగాయి. హృతిక్ కూడా ఆ మేరకు కొంత ప్రయత్నం చేశాడు. కానీ సుజానే అంగీకరించలేదు. ఇన్నేళ్ల తర్వాత ఓపెన్ గా ఒక భామతో డేటింగ్ చేస్తున్నాడు. కెమెరా మెన్లు ఉన్నా కూడా వారిని చూసి కూడా తప్పించుకోలేదు. దీన్ని బట్టి మ్యాటర్ కొంచెం సీరియస్ అని అంటున్నారు బాలీవుడ్ జర్నలిస్టులు.
హృతిక్ రోషన్ ప్రస్తుతం ‘విక్రమ్ వేదా’ అనే సినిమాలో నటిస్తున్నాడు.