నయనతార పెళ్లికి భారీ సెక్యూరిటీ

దర్శకుడు విఘ్నేష్ శివన్, స్టార్ హీరోయిన్ నయనతార వివాహానికి సంబంధించిన ఏర్పాట్లు జోరందుకున్నాయి. ఇప్పటికే కొంతమంది ప్రముఖులకు ఆహ్వానాలు అందాయి. చాలా తక్కువ మంది అతిథులకు మాత్రమే పెళ్లి పత్రికలు అందాయి.

గత కొంతకాలంగా డేటింగ్‌లో ఉన్న ఈ సెలబ్రిటీ కపుల్ పెళ్లి జూన్ 9న మహాబలిపురంలోని ఓ ప్రముఖ రిసార్ట్‌లో జరగనుంది. ఇండస్ట్రీకి చెందిన సన్నిహితులు, రాజకీయ ప్రముఖులు హాజరుకానున్న ఈ పెళ్లికి, గట్టి భధ్రత ఏర్పాటు చేస్తున్నారు.

సెక్యూరిటీలో భాగంగా పెళ్లికి వచ్చే అతిథులకు ముందుగా ఓ క్యూఆర్ కోడ్ కేటాయించారు. ఆ కోడ్ ను వివాహ వేదిక దగ్గర చూపించాలి. కోడ్ ఓకే అయిన తర్వాత మాత్రమే లోపలికి అనుమతిస్తారు. ఎంతమంది వస్తున్నారు, వాళ్ల పేర్లు ఏంటనే వివరాలన్నీ ఆ కోడ్ లోనే నిక్షిప్తం అయి ఉంటాయి. క్యూఆర్ కోడ్ పై ఒక్కరు ఎక్కువగా వచ్చినా లోపలకి అనుమతించరు.

కేవలం పెళ్లి కోసమే కాకుండా, సంగీత్ కోసం కూడా ప్రత్యేకంగా కొందర్ని ఆహ్వానించారు. సంగీత్ కు డ్రెస్ కోడ్ ఏంటనేది కూడా ముందుగానే ఫిక్స్ చేశారు. పెళ్లికి ఒక రోజు ముందు 8వ తేదీన సంగీత్ ఉంటుంది. ఈ జంట ఇటీవల తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ను తమ పెళ్లికి ఆహ్వానించేందుకు కలిశారు. ఆహ్వాన పత్రికలు అందుకున్న ప్రముఖుల్లో రజనీకాంత్, అజిత్ ఉన్నారు.

 

More

Related Stories