బంగార్రాజు కోసం భారీ సెట్

- Advertisement -
Nagarjuna and Ramya Krishna


నాగార్జున హీరోగా రూపొందనున్న ‘బంగార్రాజు’ సినిమా వచ్చేవారం మొదలు కానుంది. ఈ సినిమా కోసం భారీ సెట్ వేస్తున్నారు. పెద్ద చిత్రాలకు సెట్స్ వేసే ఆర్ట్ డైరెక్టర్ రవీందర్ తో స్వర్గం సెట్ వేస్తున్నారు.

జనరల్ గా నాగార్జున తాను నిర్మించే చిత్రాల విషయంలో బడ్జెట్ ని అదుపులో ఉంచుతారు. ‘బంగార్రాజు’కి మాత్రం భారీగా ఖర్చు పెట్టనున్నారు. ఈ సినిమా ‘సోగ్గాడే చిన్ని నాయన’ చిత్రానికి సీక్వెల్ ఇది. ఒరిజినల్ సినిమా పెద్ద హిట్ కాబట్టి ఆ బ్రాండ్ నేమ్ మంచి బిజినెస్ అవుతుంది. ఆ ధీమాతోనే ఈ సినిమా ఖర్చు విషయంలో వెనుకాడడం లేదు నాగార్జున.

కళ్యాణ్ కృష్ణ డైరెక్ట్ చేసే ఈ మూవీలో నాగ చైతన్య కూడా ఒక హీరో. చైతన్య సరసన కృతి శెట్టి నటిస్తుంది. నాగార్జున సరసన రమ్యకృష్ణ హీరోయిన్. అలాగే, మోనాల్ గజ్జర్ సహా పలువురు ఇతర భామలు కనిపిస్తారు. కాస్టింగ్, ప్రొడక్షన్ భారీగా ఉండేలా కేర్ తీసుకుంటున్నారట.

నాగార్జున ఇటీవల నటించిన సినిమాలేవీ బాక్సాఫీస్ వద్ద ఆడలేదు. ఈ సినిమాపై నమ్మకం పెట్టుకున్నారు.

 

More

Related Stories