‘అనురాగ్ నాతో మిస్ బెహేవ్ చెయ్యలేదు’

బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ కశ్యప్ తనని లైంగికంగా వేధించాడని “ఊసరవెల్లి” హీరోయిన్ పాయల్ ఘోష్ చేసిన ఆరోపణలు ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. అనురాగ్ కశ్యప్ ఇద్దరు మాజీ భార్యలు ఇప్పటికే అనురాగ్ కి మద్దతుగా సోషల్ మీడియాలో పోస్ట్స్ పెట్టారు. తాప్సి వంటి హీరోయిన్లు, రామ్ గోపాల్ వర్మ వంటి దర్శకులు కూడా అనురాగ్ ఏ హీరోయిన్ తో అలా ప్రవర్తించడని చెప్పారు.

ఇప్పుడు “కాలా” హీరోయిన్ హ్యూమా ఖురేషి స్పందించింది.

అనురాగ్ తన జిప్ విప్పి తనపై పడ్డాడు అని ఆరోపణలు చేసిన పాయల్ … మరో మాట కూడా చెప్పింది. తాను హ్యూమా, రిచా చద్దా వంటి హీరోయిన్లను కూడా ఇలాగే వాడాను అని అనురాగ్ తనతో చెప్పాడని పాయల్ చెప్పింది. దాంతో రిచా చద్దా ఇప్పటికే పాయల్ కి వ్యతిరేకంగా లీగల్ నోటీసులు పంపింది.

ఇప్పుడు హ్యూమా సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. “అనురాగ్ తో నేను 2013లో చివరిసారిగా వర్క్ చేశాను. అనురాగ్ నాతో ఎప్పుడు మిస్ బిహేవ్ చెయ్యలేదు. అలాగే ఇతర అమ్మాయిలతో ఆలా ప్రవర్తించినట్లుగా నాకు కనిపించలేదు. ఎవరితో అయినా అనురాగ్ ఆలా చేసి ఉంటే వారు పోలీస్ కంప్లైంట్ చెయ్యాలి. లీగల్ గా చర్య తీసుకోవాలి. నేను ఈ విషయంలో స్పందించొద్దు అనుకున్నా కానీ ఇదే నా లాస్ట్ వివరణ. ఇలాంటి రొచ్చులోకి మా పేర్లను లాగొద్దు,” అని హైమా పేర్కొంది.

మీ అవసరాల కోసం మా పేర్లను బద్నామ్ చేయొద్దు అని హ్యూమా వేడుకొంది.

Related Stories