రెండు వారాల్లోనే ఓటిటిలోకి

Hunt


ఒక సినిమా థియేటర్లో విడుదలైన తరవాత కనీసం నాలుగు నుంచి ఆరు వారాల గ్యాప్ ఉండాలి అని నిర్మాతల మండలి ఆ మధ్య నిర్ణయం తీసుకొంది. కానీ దాన్ని పాటించడం లేదు. తాజాగా ఒక సినిమా రెండు వారాల్లోనే ఓటిటి వేదికపై ప్రత్యక్షం కానుంది.

సుధీర్ బాబు హీరోగా నటించిన హంట్ సినిమా రిపబ్లిక్ డే సందర్భంగా విడుదలైంది. కానీ సినిమా దారుణ పరాజయం చూసింది. దాంతో ఫిబ్రవరి 10న ఈ సినిమాని ఓటిటిలో రిలీజ్ చేస్తున్నారు.

ఈ సినిమాలో సుధీర్ బాబు ఒక విలక్షణ పాత్ర పోషించారు. ఆ పాత్రలో సుధీర్ బాబుని జీర్ణించుకోలేకపోయారు ప్రేక్షకులు. ఇది ‘ముంబై పోలీసు’ అనే మలయాళ సినిమాకి రీమేక్. ఆ మలయాళ చిత్రం ఇప్పటికే ఓటిటిలో ఉంది. ఇప్పుడు దానికి జత అవుతోంది.

సుధీర్ బాబు హీరోగా తనకంటూ ఒక మార్కెట్ క్రియేట్ చేసుకున్నా అది ఈ సినిమా విషయంలో పని చెయ్యలేదు. మొదటి రోజుకే ఢమాల్ అనిపించుకొంది. అందుకే, ఇంత తొందరగా ఓటిటిలోకి వచ్చేసింది.

 

More

Related Stories