శిల్పాశెట్టికి పెద్ద షాక్

Shilpa Shetty

శిల్పాశెట్టికి 46 ఏళ్ళు. కానీ ఈ వయసులో కూడా ఆమెకి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఆమె అందమైన తన ఫోటోలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటుంది. యోగ వీడియోలు ఆమెకి బాగా క్రేజ్ తెచ్చాయి. బుల్లితెరపై షోలతో బాగా సంపాదించింది. సినిమాల్లో హీరోయిన్ గా నటించినప్పటికన్నా ఇప్పుడు ఎక్కువ పోపులారటీ పొందింది. మళ్ళీ తెలుగు, తమిళ సినిమాల్లో నటించాలని ఆమె సమాయత్తమవుతున్న తరుణంలో పెద్ద షాక్ తగిలింది.

ఆమె భర్త రాజ్ రాజ్ కుంద్రాని నిన్న ముంబై పోలీసులు అరెస్ట్ చేశారు. అది కూడా నీలిచిత్రాల నిర్మాణం కేసులో. ఒక యాప్ ద్వారా పోర్న్ సినిమాలు నిర్మిస్తున్నారు అనేది పోలీసుల మాట. ఈ కేసులో తమ వద్ద పక్కా ఆధారాలున్నాయని అంటున్నారు పోలీసులు.

ఈ కేసు ఎలా మలుపు తిరుగుతుందో చూడాలి. కానీ ఇది శిల్పాశెట్టికి షాక్. అందంగా సాగుతున్న ఆమె లైఫ్ లో ఇదో పెద్ద కుదుపు.

ALSO READ: Shilpa Shetty’s husband Raj Kundra arrested

శిల్పాశెట్టిని త్రివిక్రమ్ తన కొత్త సినిమాలో మంచి పాత్ర ఇవ్వనున్నారు అని ఆ మధ్య ప్రచారం జరిగింది. అందులో నిజమెంతో తెలియదు కానీ ఆ ప్రచారం వాళ్ళ తెలుగువాళ్ళ చూపు మరోసారి ఆమెపై పడింది.

 

More

Related Stories