వర్షాలు, కరోనా… టాలీవుడ్ విలవిలా

జల ప్రళయంతో హైదరాబాద్ విలవిలాడుతోంది. జూబిలీ హిల్స్, మాదాపూర్, కేపీహెచ్బీ, పంజాగుట్ట,ఎస్సార్ నగర్ వంటి కాలనీలలో ఎలాంటి విలయం లేదు కానీ పాతబస్తీ, దిల్సుఖ్ నగర్, హయత్ నగర్,సరూర్ నగర్, ఫలక్నుమా, చార్మినార్, సికిందరాబాద్, లంగర్ హౌజ్, మణికొండ, ఉప్పల్ ….. వంటి ఇతర ప్రాంతాలు వారం రోజుల తర్వాత కూడా ఇబ్బంది పడుతున్నాయి. కొన్ని కాలనీలు రోజుల తరబడి నీళ్లలోనే మునిగి ఉన్నాయి.

కనీవినీ ఎరుగని వర్షపాతంతో పాటు అడ్మినిస్ట్రేషన్ లోపాలు… ఈ ప్రాంతాలు జలదిగ్బంధంలో చిక్కుకోవడానికి కారణాలు. ఇప్పుడిప్పుడే కరోనా నుంచి కోలుకుంటున్న హైదరాబాద్ నగరాన్ని, తెలంగాణాని ఈ వర్షాలు మరింతగా దెబ్బతీశాయి.

ఇక సినిమా ఇండస్ట్రీకి కూడా బాగా దెబ్బ. గత నెల నుంచే షూటింగ్లు మొదలయ్యాయి. సరిగ్గా అన్ని సినిమాల షూటింగులు ఊపందుకుంటున్నాయి అనుకునే తరుణంలో ఈ వానలు మళ్ళీ…. ఇండస్ట్రీని స్తంభించేలా చేసింది. అవుట్ డోర్ లో షూటింగ్ జరుపుకుంటున్న సినిమాలన్నీ పనులు ఆపేశాయి.

స్టూడియోల్లో జరిగే షూటింగ్లు మాత్రం జరుగుతున్నాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో థియేటర్లు మళ్లీ పూర్తిగా తీర్చుకునే ఛాన్స్ లేకుండా చేశాయి ఈ వర్షాలు. కొన్ని చోట్లా థియేటర్లు ప్రారంభం అయినప్పటికీ… వాటి కలెక్షన్లు లెక్కలోకి తీసుకునేవి కాదు. ఇండస్ట్రీ కోలుకోవడానికి చాలా టైం పట్టేలా ఉంది.

Related Stories