‘హైదరాబాద్ వెదర్ అదుర్స్’

Kangana Ranaut

హైదరాబాద్ లో వాతావరణం అదిరిపోయింది అని అంటోంది కంగనా. ఆమె మొన్నటివరకు హైదరాబాద్ లో షూటింగ్ చేసింది. జయలలిత జీవితం ఆధారంగా తెరకెక్కుతోన్న “తలైవి” అనే బయోపిక్ లో నటించేందుకు రామోజీ ఫిలిం సిటీ వచ్చింది. షెడ్యూలు పూర్తిచేసుకొని మళ్ళీ తన సొంత సిటీ మనాలికి వెళ్ళిపోయింది.

మనాలిలో తన ఇంట్లో కూర్చొని ఒక ఫోటో షేర్ చేస్తూ… “హైదరాబాద్ లో వెదర్ అదిరిపోయింది. ఇక్కడ మనాలిలో వింటర్ మెల్లగా వచ్చేస్తోంది,” అని పోస్ట్ చేసింది. మొన్నటివరకు పొలిటికల్ కామెంట్లతో హీటెక్కించిన కంగనా ఇప్పుడు కొంచెం సినిమాలు, వెదర్ వంటి సింపుల్ విషయాలు మాట్లాడుతోంది.

ఇక, కంగనా రనౌత్ జయలలితగా ఎలా మెప్పిస్తుంది అనేది చూడాలి. ఇటీవల విడుదలైన ఫొటోస్ మాత్రం నిరాశపర్చాయి. జయలలిత పోలికలే లేవు ఆమె ముఖంలో.

Related Stories