పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కనున్న ఆది

Hyper Aadi
Hyper Aadhi

ఎప్పుడు సరదాగా ఉంటూ, అందర్నీ నవ్వించే హైపర్ ఆదికి కోపమొచ్చింది. త్వరలోనే తను పోలీస్ స్టేషన్ కు వెళ్తానని, సైబర్ క్రైమ్ వాళ్లను కలిసి ఫిర్యాదు చేస్తానంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాడు ఈ జబర్దస్త్ స్టార్. ఇంతకీ హైపర్ ఆదికి ఎందుకంత కోపం వచ్చింది.. అతడి మాటల్లోనే..

“ఇటీవల ట్విట్టర్ , ఇనస్టాగ్రామ్,ఫేస్ బుక్ లో నా పేరు మీద కొన్ని ఫేక్ అకౌంట్స్ క్రియేట్ చేసి వాటి ద్వారా ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తున్నారని నా దృష్టికి వచ్చింది .. దీనికి నాకు ఎటువంటి సంబంధం లేదు.. నేను ప్రభుత్వాన్ని, ప్రజాభిప్రాయాల్ని గౌరవించే వాడిని. ఎవరో పనికట్టుకొని నా పేరు మీద క్రియేట్ చేసిన ఈ అసత్య ప్రచారాలపై త్వరలోనే సైబర్ క్రైమ్ వాళ్ళని కలిసి కంప్లైంట్ ఇవ్వడం జరుగుతుంది..”

చూశారుగా.. హైపర్ ఆది ఆగ్రహానికి కారణం ఇది. అందులో కొంత నిజం కూడా ఉంది. జనసేన పార్టీతో క్లోజ్ గా వర్క్ చేసే హైపర్ ఆది పేరిట కొన్ని పోస్టులు తయారుచేసి, దాన్ని జనసేన పార్టీ వాయిస్ గా చిత్రీకరిస్తూ కొన్ని కథనాలు పుట్టుకొస్తున్నాయి. వీటిలో ఏపీ ప్రభుత్వంపై ఘాటైన విమర్శలు కూడా ఉన్నాయి. వీటన్నింటిపై హైపర్ ఆది ఇలా రియాక్ట్ అయ్యాడు.

తనకు ఫేస్ బుక్ ఎకౌంట్ (అది కూడా వెరిఫైడ్) తప్ప మరే సోషల్ మీడియా ఎకౌంట్ లేదని ఈ సందర్భంగా స్పష్టంచేస్తున్నాడు హైపర్ ఆది.

Related Stories