
కమెడియన్, బుల్లితెర నటుడు హైపర్ ఆది పవన్ కళ్యాణ్ కి వీరాభిమాని. చాలాకాలంగా పవన్ కళ్యాణ్ కి అనుకూలంగా సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నాడు హైపర్ ఆది. మొదట్లో ఆ ట్విటర్ అకౌంట్ నాది కాదు అంటూనే పవన్ కళ్యాణ్ ని విమర్శించే వారిపై ఘాటుగా కామెంట్స్ పెట్టేవాడు. ఇక ఇప్పుడు జనసేన తరఫున ప్రచారం మొదలుపట్టాడు.
గురువారం శ్రీకాకుళం జిల్లాలోని రణస్థలంలో నిర్వహించిన జనసేన యువశక్తి సభలో హైపర్ ఆది పాల్గొన్నాడు. ఆంధ్రప్రదేశ్ మంత్రులపై ఘాటుగా కామెంట్స్ చేశాడు. మంత్రులు అందరూ తమ శాఖల పేర్లు మార్చుకొని “పవన కళ్యాణ్ గారిని తిట్టే శాఖ” అని పెట్టుకుంటే మంచిది అంటూ మంత్రులకు చురకలు వేశాడు.
ఇకపై జనసేన తరఫున విస్తృతంగా ప్రచారం చేస్తానని హింట్ ఇచ్చాడు.
హైపర్ ఆది సభలో వేసిన పంచ్ లకు మంచి స్పందన వచ్చింది. పవన్ కళ్యాణ్ కూడా ఎంజాయ్ చేశారు.