
నేహా శెట్టి ఇప్పుడు బిజీ భామ అయింది. ఆమె అందచందాలు కుర్రకారుని ఆకర్షిస్తున్నాయి. అందుకే, ఆమెకి బాగా క్రేజ్ పెరిగింది. ఆమె నటించిన “బెదురులంక 2012” ఈ శుక్రవారం విడుదల కానుంది. ఈ సినిమాలో ఈ భామ పల్లెటూరి యువతిగా నటించింది.
“నేను తెలంగాణ రాధికగా నటిస్తే మీరు అందరూ ఆదరించారు. ఇప్పుడు నేను ఆంధ్ర అమ్మాయిని. ఈ సినిమాలో ఆంధ్రా చిత్రగా నటించాను. డీజే టిల్లు రాధికని పాపులర్ చేసినట్లే చిత్రని కూడా ఆదరిస్తారు అని ఆశిస్తున్నా,” అని అభిమానులను కోరింది.
నేహా శెట్టి నటించిన మరో రెండు చిత్రాలు కూడా విడుదలకు సిద్ధం అవుతున్నాయి. కిరణ్ అబ్బవరం సరసన “రూల్స్ రంజన్” అనే చిత్రంలో నటించింది. ఈ సినిమా వచ్చే నెలలో విడుదల అయ్యే అవకాశం ఉంది. అలాగే, విశ్వక్ సేన్ సరసన “గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి” చిత్రంలో నటిస్తోంది. ఈ సినిమా డిసెంబర్ లో విడుదల కానుంది.
ఇటు “బెదురులంక”లోనూ, అటు “గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి”లోనూ గోదారి గాళ్ గానే కనిపిస్తుంది.