నేను కొంచెం సైకోని: రష్మిక


సంక్రాంతి పండుగ సందర్భంగా హీరోయిన్లు అందరూ సాంప్రదాయ పద్దతిలో చీర కట్టుకోనో, లంగావోణీ ధరించో ఫోటోలు తీసుకొని వాటిని ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేశారు. మరి కొందరు ముగ్గులు వేస్తున్న, పతంగులు ఎగరేస్తున్న ఫోటోలను అప్లోడ్ చేశారు.

కానీ పండగ రోజు జిమ్ ఫోటోలు ఎవరైనా షేర్ చేస్తారా? అలా చేసిన వాళ్ళను ఏమనాలి? సైకో అని పిలవాలి అంటోంది రష్మిక మందాన. ఈ ‘పుష్ప’ సుందరి సంక్రాంతి రోజు అదే పని చేసింది మరి. సంక్రాంతి నాడు కూడా జిమ్ లో కసరత్తులు చేస్తూ, అక్కడ నిలబడి ఉన్న ఫోటోలను షేర్ చేసింది. “అన్నట్లు నేను సైకో అని రుజువైంది కదా! జిమ్ లోనే బతికే సైకోని,” అంటూ తన ఫోటోకి క్యాప్సన్ కూడా రాసుకొంది.

రష్మిక, సమంత, పూజ హెగ్డే వంటి భామలు ఎక్కవగా తమ యోగా వీడియోలను, జిమ్ లో కష్టపడే వీడియోలను పెడుతుంటారు. ఐతే, పండగనాడు కూడా ఇలాంటివి పెట్టడం కొంచెం అతి అని చెప్పాలి. అందుకే తనను తాను సైకో అని పిలుచుకుంటోంది రష్మిక.

‘పుష్ప’ సినిమాలో శ్రీవల్లిగా నటించి మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకొంది. ఈ ఏడాది రెండు హిందీ సినిమాలతో, రెండు తెలుగు చిత్రాలతో మనల్ని అలరించనుంది.

 

More

Related Stories