నేను చాలా లక్కీ: దిశా

- Advertisement -

బాలీవుడ్ లో హీరోయిన్ గా దిశా పటాని రైజ్ అవుతోంది. ఆమె తెలుగులోనే మొదట పరిచయం అయింది. కానీ తెలుగులో క్లిక్ కాలేదు. హిందీలో తక్కువ టైంలోనే ఎక్కువ క్రేజ్ తెచ్చుకొంది. అంతేకాదు, తన సక్సెస్ కి కారణం చాలా వరకు లక్ అని చెప్తోంది.

“నేను చాలా లక్కీ పర్సన్ అని చెప్పొచ్చు. ఎందుకంటే, చాలా మంది హీరోయిన్లు ఉన్నారు. కానీ నాకు మంచి అవకాశాలు వచ్చాయి. పెద్ద సినిమాలు పడ్డాయి. వాటిని కరెక్ట్ గా ఉపయోగించుకున్నాను,” అంటోంది ఈ బ్యూటీ

సల్మాన్ ఖాన్ సరసన ‘రాధే’ సినిమాలో నటించిన ఈ అందాల రాధ… సల్మాన్ శిష్యుడు టైగర్ ష్రాఫ్ కి రియల్ గర్ల్ ఫ్రెండ్. ఐతే, టైగర్ గర్ల్ ఫ్రెండ్ కావడం వాళ్ళ ఆఫర్లు రాలేదంటోంది. తన కష్టం, తన లక్ వల్లే కెరీర్ సెట్ అయిందట.

దిశా పటాని ఆరేళ్ళ క్రితం పూరి జగన్నాధ్ తీసిన ‘లోఫర్’ అనే సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయింది. ఇప్పుడు ‘పుష్ప’ సినిమాలో ఆమెని ఐటెం గర్ల్ గా నటింపచేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి.

 

More

Related Stories