నేను జోకర్ ని కాదు: బండ్ల గణేష్

Bandla Ganesh

తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ పై విమర్శలు గుప్పించారు టీఆరెస్ నాయకురాలు కవిత. బండ్ల గణేష్ లా బండి సంజయ్ కూడా జోకర్ అన్నట్లుగా ఆమె కామెంట్ చేశారు. ఆమె విమర్శలు చేసింది బీజేపీ నేతపైనే. కానీ అందులో తన పేరును వాడడం, తనని జోకర్ గా అభివర్ణించడంతో నిర్మాత బండ్ల గణేష్ కి కోపం వచ్చింది.

ట్విట్టర్లో ఆమెని టాగ్ చేస్తూ తాను జోకర్ కాదు ఫైటర్ అని సమాధానం ఇచ్చారు బండ్ల. “గబ్బర్ సింగ్”, “బాద్ షా” వంటి సినిమాలు నిర్మించిన బండ్ల గణేష్ 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీలో చేరి తెలంగాణ సీఎం కేసీఆర్ పై వీరంగం వేసిన సిట్యుయేషన్ మనమంతా చూశాం. కేసీఆర్ ఓడిపోతాడని, ఆలా జరగకపోతే సెవెన్ ఓ బ్లేడ్ తో గుండు గీయించుకుంటా అని ఛాలెంజ్ విసిరడం….. ఆ తర్వాత ఫలితాలు చూసి కళ్ళు బైర్లు కమ్మడం గణేష్ వంతు అయింది. అందుకే, అతన్ని జోకర్ గా అభివర్ణించి ఉంటారు కవిత.

ఐతే, బండ్ల గణేష్ మాత్రం తన తప్పుని తెలుసుకొని పూర్తిగా రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. ఏ పార్టీతో సంబంధం లేదని ఇప్పటికే చాలాసార్లు చెప్పారు. అయినా కూడా తనని జోకర్ అనడంతో ఆయన కవితకు ట్వీట్ చేసి… మళ్ళీ వార్తల్లో నిలిచారు బండ్ల.

More

Related Stories