ఒరిజినల్ పీస్ అంటోన్న భామ

“భానుమతి… ఒక్కటే పీస్” అని సాయి పల్లవి చెప్పిన డైలాగ్ గుర్తుందా? అలాంటి డైలాగ్ కొడుతోంది అనసూయ. ఆమె చెప్తున్న డైలాగ్… నేను ఒరిజినల్.

“నేను పర్ఫెక్ట్ కాదు ఎందుకంటే నేను ఒరిజినల్ పీస్,” అని చెప్తూ తన సోకులను కేకుల్లా వడ్డిస్తోంది సోషల్ మీడియా వేదికపై. ప్రతి వారం ఫోటోషూట్ ఫోటోలని షేర్ చేస్తుంటుంది అనసూయ. ఒక్కో షూట్ కి ఒక్కో డైలాగ్ కొడుతుంటుంది. ఈ సారి ఇలా తాను ఒరిజినల్ అంటూ స్టేట్ మెంట్ ఇచ్చింది.

ALSO CHECK: Anasuya’s Latest Glamorous Photos

అనసూయ అటు జబర్దస్త్ షోలతో పాటు ఇటు సినిమాలు కూడా జబర్దస్త్ గా చేస్తోంది. అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్లో తెరకెక్కుతోన్న “పుష్ప” సినిమాలో ఆమె ఒక విలన్ కి భార్యగా నటిస్తోంది. ‘రంగస్థలం’లో కన్నా పవర్ ఫుల్ పాత్ర. ఆమె వల్లే కథ మొత్తం టర్న్ అవుతుందని చెప్తున్నారు. ఆమె కెరీర్లో మరో బెస్ట్ మూవీ అవుతుందట.

https://twitter.com/MythriOfficial/status/1420723985470263297?s=20

‘పుష్ప’తో పాటు ఆమె మరో మూడు కొత్త సినిమాలు ఒప్పుకొంది. నటిగా ఆమె ఫుల్ బిజి.

 

More

Related Stories