నేనింకా గర్భవతిని కాలేదు: తాప్సి

- Advertisement -
Taapsee

హీరోయిన్ తాప్సికి 35 ఏళ్ళు. కెరీర్ కోసమని సాధారణంగా హీరోయిన్లు 30, 32 ఏళ్లకు పెళ్లి చేసుకుంటారు. కొందరు 35 వరకు ఆగుతారు. ఆ లెక్కన చూస్తే పెళ్లి వయస్సు దాటింది తాప్సి. అందుకే, ఈ భామకి ఇటీవల పెళ్లి గురించి ప్రశ్నలే ఎక్కువగా ఎదురవుతున్నాయి. ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పేందుకు ఇంతకుముందు నిరాకరించింది. కానీ తాజాగా మీడియాకి ఆమె కౌంటర్ ఇచ్చింది.

పెళ్లి ఆలోచన లేదా అన్న ఒక జర్నలిస్ట్ అడిగిన ప్రశ్నకు “నేను ఇంకా గర్భవతిని కాలేదు కదా” అంటూ సమాధానం ఇచ్చింది.

ఇటీవల బాలీవుడ్ లో హీరోయిన్లు పెళ్లి అయినా 15, 20 రోజులకే తాము గర్భం దాల్చినట్లు ప్రకటిస్తున్నారు. అంటే, వాళ్ళు ప్రెగ్నెంట్ అని తెలిసిన వెంటనే తమ బాయ్ ఫ్రెండ్ ని పెళ్ళాడుతున్నారు అని అర్థం అవుతోంది. అనుకోకుండా ప్రెగ్నెంట్ ఐతే వెంటనే పెళ్లి చేసేసుకుంటున్నారు. ఇక ఇలియానాలాంటి వాళ్ళు పెళ్లి కాకుండానే తాము గర్భం దాల్చినట్లు ప్రకటించారు. ఈ ట్రెండ్ ని ప్రస్తావిస్తూ తాప్సి సమాధానం ఇచ్చింది.

తాను ఇంకా గర్భవతి కాదు కదా పెళ్లి చేసుకోవడానికి అని కౌంటర్ ఇచ్చింది.

Taapsee

డెన్మార్క్ కి చెందిన 43 ఏళ్ల బ్యాడ్మింటన్ క్రీడాకారుడు మథియాస్ బోతో ఆమె చాలా కాలంగా డేటింగ్ లో ఉంది.

More

Related Stories