- Advertisement -

“నాకు నచ్చినట్లు ఉంటా… నాకు నచ్చిందే చేస్తా. మీరు కూడా మీకు ఎలా సంతోషం కలుగుతుందో అలా ఉండండి,” అని హీరోయిన్ శృతి హాసన్ చెప్తోంది. ఇటీవల ఆమె చేసిన కొన్ని ఫోటోషూట్లు జనాలని భయపెట్టాయి. మీడియాలో ఈ వార్తలు రావడంతో స్పందించింది.
“మనం వేసుకునే డ్రెస్, ఫ్యాషన్… కాలాన్ని బట్టి మారుతుంటాయి. ఇప్పుడు చాలా విచిత్రంగా అనిపించే ఫ్యాషన్… కొన్నాళ్ళకు రెగ్యులర్ ట్రెండ్ కావొచ్చు. కాబట్టి మనకు నచ్చింది చెయ్యాలి,” అని వివరణ ఇచ్చింది. ఈ భామ ఎక్కువగా విదేశీ సింగర్స్ వేసుకునే ఫ్యాషన్ ట్రెండ్ ని ఫాలో అవుతుంది.
ప్రస్తుతం, శృతి హాసన్ ప్రభాస్ సరసన ‘సలార్’ సినిమాలో నటిస్తోంది.