అలా డ్యాన్స్ చేసే బాపతు కాను!

Kangana

డబ్బుల కోసం పెళ్లి వేడుకల్లో డ్యాన్స్ చేసే బాపతు తారలు కొందరు ఉన్నారు కానీ నేను అలాంటిదాన్ని కాను అంటోంది హీరోయిన్ కంగన. ఆమె తాజాగా ఇన్ స్టాగ్రామ్ లో ఇలా పోస్ట్ చేసింది. అంటే ఇన్ డైరెక్ట్ గా ఆమె షారుక్ ఖాన్, అమీర్ ఖాన్, సల్మాన్ ఖాన్ లను ఉద్దేశించి ఈ కామెంట్స్ చేసిందని అర్థం అవుతోంది.

ఇటీవల రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ కొడుకు అనంత్ అంబానీ పెళ్లి వేడుకలలో ఖాన్ హీరోలు డ్యాన్స్ చేశారు. ఈ డ్యాన్స్ లకు వారికి భారీగా డబ్బు ముట్టింది అని టాక్. ఈ వీడియోలు చూసిన తర్వాతే కంగన ఇలా పోస్ట్ చేసింది.

భారతరత్న లతా మంగేష్కర్ కూడా ఎంత డబ్బు ఆఫర్ చేసినా పెళ్లి వేడుకల్లో పాటలు పాడేందుకు నిరాకరించారు. తాను కూడా అంతే అని చెప్తోంది కంగన.

డబ్బు కన్నా ఆత్మగౌరవం ముఖ్యమంటోంది ఈ భామ.

Advertisement
 

More

Related Stories