
పూనమ్ పాండేని గతేడాది ఆమె భర్త సామ్ బాంబే దారుణంగా కొట్టాడు. దాంతో అతన్ని పోలీసులు అరెస్ట్ చేశారు. అతని నుంచి పూనమ్ పాండే విడిపోయింది. ఇప్పుడు విడిగా ఉంటోంది. త్వరలోనే ఒక కొత్త మూవీతో ప్రేక్షకుల ముందుకొస్తుందట. ఒక ఇంటర్వ్యూలో పలు విషయాలను వెల్లడించింది.
“నా పెళ్లి, కాపురం ఒక పీడకల. దాని గురించి మాట్లాడదల్చుకోలేదు. ఇప్పుడు ప్రశాంతంగా ఉన్నాను. మరోసారి పెళ్లి, ప్రేమ వంటి ఆలోచన చెయ్యను. నా మనసు వాటిపై లేదు,” అని చెప్పింది పూనమ్.
శృంగారతారగా పేరొందిన పూనమ్ పాండే అవకాశాల కోసం ఏమి చేసి ఉంటుంది అనే ప్రశ్న చాలా మందిలో ఉంది. “మీరు నమ్మరు కానీ నిజం ఏంటంటే నేను ఇంతవరకు కాస్టింగ్ కౌచ్ ని ఎదుర్కోలేదు. నా విషయంలో అది జరగలేదు,” అని చెప్పింది. ఆమె నిజమే చెప్తోంది అంటారా? మన అభిప్రాయం ఏముంది…అది ఆమె చెప్తున్న వెర్షన్.
ఇంతకీ… నెక్స్ట్ ఏంటి? “ఒక సినిమా ఒప్పుకున్నాను. 2022 గ్రాండ్ గా ప్రారంభం కానుంది. ఆ సినిమా వివరాలు మేకర్స్ ప్రకటిస్తారు,” అని సెలవిచ్చింది ఈ ‘పెద్దలకు మాత్రమే’ చిత్రాల అమ్మడు.