ఇప్పుడు బాయ్ఫ్రెండ్ లేడు: సుష్మిత

- Advertisement -
Sushmita Sen


ప్రస్తుతం తనకి బాయ్ ఫ్రెండ్ లేడు అని చెపుతున్నారు సుష్మిత సేన్. ఆ మధ్య లలిత్ మోడీని పెళ్లి చేసుకోబోతుంది అని వార్తలు వచ్చాయి. కానీ, వీరి లేట్ వయసులో హాట్ డేటింగ్ ఎక్కువ కాలం నిలవలేదు. ఇద్దరూ బ్రేకప్ చెప్పుకున్నారు.

సుష్మిత సేన్ కిప్పుడు 48 ఏళ్ళు. లలిత్ మోడీకి 59 ఏళ్ళు. ఇద్దరిదీ సరైన జోడి వయసు పరంగా. కానీ, వీరి డేటింగ్ కొన్నాళ్లు మాత్రమే సాగింది. ఇప్పుడు తన జీవితంలో ఏ మగాడు లేదు అని అంటున్నారు సుష్మిత.

సుష్మిత సేన్ చాలా మందితో డేటింగ్ చేశారు. ఒక దర్శకుడితో దాదాపు 10 ఏళ్ల పాటు రిలేషన్ షిప్లో ఉన్నారు. ఐతే, ఎవరితో డేటింగ్ చేసినా ఆమె ఎప్పుడూ పెళ్లి వరకు వెళ్ళలేదు.

రీసెంట్ గా లలిత్ మోడీ విషయంలో మాత్రం పెళ్లి ఆలోచన చేసినట్లు వార్తలు వచ్చాయి. ఆ టైంలోనే ఆమెని అందరూ గోల్డ్ డిగ్గర్ అన్నారు. అంటే అతన్ని ఆమె డబ్బు కోసమే వలలో వేసుకుంది అని కామెంట్స్ వచ్చాయి. కానీ లలిత్ తో కూడా బ్రేకప్ చెప్పడం వల్ల ఆమెని గోల్డ్ డిగ్గర్ అని కామెంట్ చేసిన వారికే రివర్స్ పంచ్ పడినట్లు అయింది.

 

More

Related Stories