ఆ బాడీ పార్ట్ కే ఎక్కువ ఖర్చు పెట్టా: శృతి

Shruti Haasan

మొహమాటం లేకుండా… కుండబద్దలు కొట్టినట్లు మాట్లాడే హీరోయిన్లలో మొదటి స్థానం శృతి హాసన్ కే దక్కుతుంది. తరుచుగా బాయ్ ఫ్రెండ్స్ ని మార్చేస్తుంటుంది. అయినా ఆ విషయాన్ని దాచిపెట్టదు. అలాగే, ఒకప్పుడు తన తాగుడు అలవాటు గురించి కూడా బయటపెట్టింది.

తాజాగా అలాంటిదే మరోటి చేసింది. తన బాడీ పార్ట్స్ గురించి మాట్లాడింది. ఇటీవల అభిమానులతో ఆమె ఇన్ స్టాగ్రామ్ ముచ్చటిచ్చింది. అదీ కూడా తన కొత్త బాయ్ ఫ్రెండ్ శాంతను హజారికాతో బెడ్ లో కూర్చొని చాట్ సెషన్ వేసింది.

ఒక అభిమాని నీ బాడీలో ముక్కు ఇష్టమేనా అని ప్రశ్న వేశాడు. దానికి ఆమె ఇచ్చిన సమాధానం సూపర్ గా ఉందని చెప్పాలి.ఏ హీరోయిన్ కూడా అలా చెప్పుకోదు.

ప్రశ్న: నీ ముక్కు నీకు ఇష్టమేనా?
శృతి: ఓ ఎస్… ఎందుకంటే నా బాడీలో ఎక్కువ ఖర్చు పెట్టింది ఆ పార్ట్ కే.

Shruti Haasan

అవును… ఆమె ముక్కుకి కాస్మెటిక్ సర్జరీ చేయించుకొంది. మొదట ఆమె ముఖంలో ముక్కే కొంచెం తేడాగా ఉంది అని కామెంట్స్ వచ్చాయి. దాంతో సర్జరీ చేయించుకొంది. కానీ సెట్ కాలేదు. మళ్ళీ లండన్ వెళ్లి సర్జరీ చేయించుకొంది. ఆమె కెరీర్ ప్రారంభంలో ఉన్న ఫేస్, ‘గబ్బర్ సింగ్’ సినిమా టైంలో ఉన్న ముక్కు ఆకృతికి చాలా తేడా ఉంటుంది. అలాగే, రీసెంట్ ఫేస్ ఇంకా కొత్తగా ఉంటుంది. అలా లక్షలు ఖర్చు పెట్టింది చక్కటి ముక్కు ఆకృతి కోసం.

ఈ విషయాన్ని శృతి హాసన్ దాచుకోకుండా చెప్పుకోవడం విశేషం. ఇటీవలే ‘క్రాక్’ సినిమా సక్సెస్ తో మళ్ళీ ఫామ్ లోకి వచ్చింది శృతి. ప్రస్తుతం ‘సలార్’ సినిమాలో ప్రభాస్ సరసన నటిస్తోంది.

Advertisement
 

More

Related Stories