ఛాలెంజింగ్ పాత్రలు ఇష్టం: అనుపమ

అనుపమ నటించిన ‘కార్తికేయ 2’ మంచి రెస్పాన్స్ వస్తోంది. కలెక్షన్లు బాగున్నాయి. దాంతో, ఈ భామ మీడియాతో ముచ్చటించింది.

“దర్శకుడు చందు గారు ఈ స్టోరీ చెప్పినప్పుడు చాలా ఎగ్జయిట్ అయ్యాను. ఈ సినిమాలో లో కృష్ణ తత్త్వం కాన్సెప్ట్ నాకు బాగా నచ్చింది కాబట్టే ఈ సినిమాకి డేట్స్ ఎక్కువ ఇచ్చాను. దీని కోసం కొన్ని చిత్రాలు కూడా వదులుకున్నాను,” అని చెప్పింది.

హీరో నిఖిల్ కన్నా కొన్ని సీన్లలో ఆమె పాత్రకే ఎక్కువ చప్పట్లు పడ్డాయి. “నా పాత్ర ఎంట్రీకి మంచి రెస్పాన్స్ వచ్చింది. కొన్ని సీన్లలో హీరోలా ఎంట్రీ ఇచ్చాను అంటున్నారు. కథకు తగినట్టుగానే నా పాత్ర ఉంది,” అని తెలిపింది అనుపమ.

డిమాండ్ చేస్తేనే ముద్దుసీన్లు

Anupama Parameswaran

రౌడీబాయ్స్’ చిత్రంలో కొత్త హీరోతో ముద్దు సీన్లు ఫుల్లుగా చేసింది అనుపమ. ఐతే, ప్రతి సినిమాలో గ్లామర్ గా నటించాలనే, ముద్దు సీన్లు చేస్తానని అనుకోవద్దు అని చెప్తోంది. “రౌడీబాయ్స్ చిత్రంలో గ్లామర్ షో అనేది కథ ప్రకారం చేశాను. కథ డిమాండ్ మేరకు ముద్దు సీన్లలో నటించాను,” అనేది ఆమె వివరణ.

‘ఛాలెంజింగ్ పాత్రలు చేస్తాను’

“నాకొచ్చే పాత్రలు ఛాలెంజింగ్ గా ఉండాలి. అలాంటి పాత్రలు నాకు నచ్చుతాయి,” అని చెప్తోంది అనుపమ. ఆమె మళ్ళీ నిఖిల్ సరసన నటిస్తోంది. “18 పేజెస్” అనే సినిమాలో ఆమె నిఖిల్ కి ప్రియురాలు. “ఆ సినిమా షూటింగ్ ఇంకా కొంత మిగిలి ఉంది. ఇంకో రెండో కొత్త సినిమాలు కూడా ఒప్పుకున్నాను.”

 

More

Related Stories