
“బహుశా నేను గతంలో సాగరకన్యని (mermaid) కాబోలు.” అని అంటోంది అనసూయ.
బీచ్లో జలకాలాడుతున్న వీడియోని ఆమె తాజాగా పోస్ట్ చేసింది. నీళ్లల్లో ఆదుకోవడం అంటే ఇష్టమని పేర్కొంది. బికినీ వేసుకొని బీచ్ లో ఎంజాయ్ చేస్తున్న ఆ వీడియో బాగా వైరల్ అయింది.
ఇటీవల కాలంలో అనసూయ గ్లామర్ వీడియోలు, ఫోటోల హడావిడి తగ్గించింది. ఎక్కువగా చీరకట్టులో ఉన్న ఫోటోలని షేర్ చేస్తోంది. సడెన్ గా సాగరకన్యని అంటూ ఆమె బికినీ వీడియో పెట్టడంతో అది వైరల్ అయింది. ఆ వీడియోని ఇక్కడ చూడొచ్చు.
ఇక ఆమె నటిగా “పుష్ప 2″తో బిజీగా ఉంది. ప్రస్తుతం ఆమె చేస్తున్న పెద్ద చిత్రం ఇదే. గత ఏడాది “మైఖేల్”, “రంగమార్తాండ”, “విమానం”, పెద్ద కాపు 1″ వంటి పలు సినిమాలు విడుదల అయ్యాయి. అందులో కొన్ని పాత్రలు ఆమె నటనలోని వైవిధ్యాన్ని చూపాయి. కానీ ఒక్కటీ కూడా విజయం సాధించలేదు. సో, “పుష్ప 2” తర్వాత మళ్ళీ ఆమెకి క్రేజ్ పెరుగుతుందేమో చూడాలి.