నేను పిరికిపందను కాను: కమల్

Kamal Haasan

కదనరంగంలోకి దూకిన తర్వాత ఓటమి భయంతో పారిపోయే రకాన్ని కాదు అంటున్నారు లోకనాయకుడు కమల్ హాసన్. కమల్ హాసన్ స్థాపించిన MNM నుంచి నాయకులు అందరూ వెళ్లిపోతున్నారు. పార్టీలో నెంబర్ టూగా ఉన్న వ్యక్తి రాజీనామా చేసి… కమల్ హాసన్ పై ఆరోపణలు చేశారు. ఐతే, ఇలాంటి ద్రోహులని పట్టించుకోను, పార్టీ ఓడిపోయినంత మాత్రాన పోరాటాన్ని ఆపేది లేదంటున్నారు కమల్ హాసన్.

ఇటీవల తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో కమల్ హాసన్ పార్టీ 150 స్థానాల్లో పోటీచేసింది. అన్నింటా ఓటమే. ఆఖరికి కమల్ హాసన్ కూడా దక్షిణ కోయంబత్తూర్ నియాజకవర్గం నుంచి పోటీ చేసి గెలవలేకపోయారు.

ఇప్పుడున్న మనీ పాలిటిక్స్ లో కమల్ హాసన్ వంటివారు నెగ్గుకురాగలరా అని మొదటినుంచి అందరిలో డౌట్స్ ఉన్నాయి. ఫలితాలు అలాగే వచ్చాయి. ఆయన పార్టీని ఎక్కువకాలం నడపలేరు, జెండా పీకేస్తారనే కామెంట్స్ వస్తున్నాయి. కానీ తన రాజకీయ పోరాటం ఒక ఎన్నికతో ఆగేది కాదంటున్నారు. గెలుపోటములతో సంబంధం లేకుండా మార్పు కోసం ప్రయత్నిస్తాను అని చెప్తున్నారు.

పార్టీని నడపడం మాటలు చెప్పినంత సులువు కాదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. మరి కమల్ హాసన్ ఎలా హ్యాండిల్ చేస్తారో అనేది చూడాలి. ఆయన త్వరలోనే ‘విక్రమ్’ అనే సినిమా షూటింగ్ స్టార్ట్ చేస్తారట.

Advertisement
 

More

Related Stories